- ఇండియాలో రూ. 6.49 లక్షలతో కొత్త స్విఫ్ట్ ధరలు ప్రారంభం
- రూ.11,000 బుకింగ్ అమౌంట్ తో బుక్ చేసుకునే సదావకాశం
మారుతి సుజుకి ఈ వారం ప్రారంభంలో ఇండియాలో ఫోర్త్-జెన్ స్విఫ్ట్‌ను లాంచ్ చేయగా,దీని ధరలు రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యాయి. టాటా టియాగో మరియు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్లకు పోటీగా ఉండే అప్డేటెడ్ హ్యాచ్‌బ్యాక్ డెలివరీ త్వరలో ప్రారంభంకానుంది.
మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్ బుకింగ్స్ మే 1వ తేదీ నుండి రూ. 11,000 బుకింగ్ అమౌంట్ తో ప్రారంభమవగా, ఇప్పుడు 2024 స్విఫ్ట్ మోడల్ కారు 10,000 బుకింగ్స్ పొందినట్లు ఆటోమేకర్ మారుతి నిర్ధారించింది. ఈ మైల్స్టోన్ బుకింగ్స్ ని చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది అంటే, బుకింగ్స్ ప్రారంభించిన 10 రోజులలోపు మరియు స్విఫ్ట్ లాంచ్ తర్వాత ఒక రోజులోపే సాధించబడింది. నిజంగా ఇది గొప్ప విషయమే అని చెప్పవచ్చు. కస్టమర్ల నుంచి దీనిని లభిస్తున్న ఆదరణ అమోఘం అని భావించవచ్చు.
2024 స్విఫ్ట్ LXi, VXi, VXi(O), ZXi మరియు ZXi+ అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ మోడల్ ని ఆరు మోనో-టోన్ మరియు మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లతో పాటుగా తొమ్మిది కలర్ల నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. హుడ్ కింద, 2024స్విఫ్ట్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటియూనిట్లతో జతచేయబడిన కొత్త 1.2-లీటర్, Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ని పొందింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్