- ఫోర్త్ జనరేషన్ మోడల్ గా వచ్చిన స్విఫ్ట్
- ఇందులో కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని పరిచయం చేసిన మారుతి
చాలా రోజుల నుంచి దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఒకే ఒక్క మోడల్ పై ఉంది. ఇప్పటి వరకు మారుతి కంపెనీ అందించిన వివిధ మోడళ్లలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్ గా ఆ కారు నిలిచింది. ఇంతకీ అది ఏ మోడల్ అని మీకు తెలుసుకోవాలని ఉందా! అదేనండి కొత్త మారుతి సుజుకి స్సిఫ్ట్. కస్టమర్ల ఎంతగానో ఇష్టపడే స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ మోడల్ గా మారుతి కంపెనీ నేడే రూ.6.49 లక్షల ఎక్స్-షోరూం ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. దీని కంటే ముందుగా మారుతి రూ. 11,000 టోకెన్ అమౌంట్ తో ఇండియాలో దాని బుకింగ్స్ ని కూడా ప్రారంభించింది. ఇప్పుడు మనం కొత్త స్విఫ్ట్ యొక్క పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
కొత్త స్విఫ్ట్ ఎలా ఉంటుంది? ఎక్స్‌టీరియర్ మరియు కలర్ ఆప్షన్స్ ఏంటి ?
కొత్త స్విఫ్ట్ సిగ్నేచర్ సిల్హౌట్‌ను కలిగి ఉంది, దీనిని దూరం నుండి కూడా చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఇందులో స్మోకీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు బూమరాంగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ అందించబడ్డాయి. అంతే కాకుండా, ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్ మరియు 15-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఈ మోడల్ లుక్ ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
కొత్త స్విఫ్ట్ ఇప్పుడు సిజ్లింగ్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ తో పాటుగా మరో రెండు కొత్త కలర్లలో అందిచబడుతుంది, అందులో లస్ట్రే బ్లూ మరియు నావెల్ ఆరెంజ్ ఉన్నాయి. అదే విధంగా, డ్యూయల్-టోన్ విషయానికి వస్తే, ఈ మోడల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో లస్టర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో సిజ్లింగ్ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్ వంటి మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందించబడింది.
కొత్త స్విఫ్ట్ ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది ?
2024 స్విఫ్ట్ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ సరికొత్త క్యాబిన్‌తో ప్రీమియం ఇంటీరియర్ ని కలిగి ఉంది, ఇది కారుకు స్పోర్టీ లుక్ ని అందిస్తుంది. క్యాబిన్‌లోని 'సెంటర్ ఫ్లోటింగ్ డిజైన్'తో కొత్త లేఅవుట్ తో డ్యాష్‌బోర్డ్ ఉంది. ఇది శాటిన్ మాట్ సిల్వర్ ఇన్‌సర్ట్‌లతో కూడిన పియానో బ్లాక్ ట్రీట్‌మెంట్ పొందగా, ఇన్‌స్ట్రుమెంట్-క్లస్టర్ కోసం స్పెషల్ డయల్స్‌ను కలిగి ఉంది, దీని ద్వారా ఇది బెస్ట్ ఫినిషింగ్ లుక్ ని పొందింది. అదనంగా, డాష్‌బోర్డులోఇది 8-డిగ్రీల వరకు బెండ్ అయ్యేలా డ్రైవర్-బేస్డ్ టిల్ట్ ని కలిగి ఉంది.
2024 స్విఫ్ట్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 9-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్, ముందు సీటులో కూర్చునే వారి కోసం టైప్-ఎమరియు టైప్-సియూఎస్‍బీపోర్ట్స్, రియర్ ఏసీవెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, 60:40 రియర్ స్ప్లిట్ సీట్లు మరియు కీలెస్ ఎంట్రీ వంటి బెస్ట్ ఫీచర్స్ అందించబడ్డాయి.
కొత్త స్విఫ్ట్ ఎంతవరకు సేఫ్ అని చెప్పవచ్చు ?
ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+ (ఈఎస్పీ), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ) మరియు బ్రేక్ అసిస్ట్‌తో హిల్ హోల్డ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి. అదనంగా, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వైడర్ రేంజ్ రివర్స్ కెమెరాను పొందింది.
కొత్త తరం స్విఫ్ట్ ఇంజిన్ మరియు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ?
2024 స్విఫ్ట్ కొత్త 1.2-లీటర్, మూడు-సిలిండర్, Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను పొందింది, ఈ ఇంజిన్ 80bhp పవర్ మరియు 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు ఎఎంటియూనిట్ ఉన్నాయి. కస్టమర్లు ఈ కారును LXi, VXi, VXi(O), ZXi మరియు ZXi+ అనే ఐదు వేరియంట్ల నుండి నచ్చిన వేరియంట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ దాని సెగ్మెంట్‌లో బెస్ట్ గా చెప్పబడే 25.75 కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది. ఇంతకు ముందున్న మోడల్ తో పోలిస్తే ఈ మోడల్ 14 శాతం కంటే ఎక్కువగా ఫ్యూయల్ ఎఫిషియన్సీని కలిగి ఉంది.
వేరియంట్ వారీగా కొత్త మారుతి స్విఫ్ట్ ఎక్స్-షోరూం ప్రారంభ ధరలు కింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధరలు |
LXi | రూ. 6.49 లక్షలు |
VXi | రూ. 7.29 లక్షలు |
VXi ఎజిఎస్ | రూ. 7.79 లక్షలు |
VXi(O) | రూ. 7.56 లక్షలు |
VXi (O) ఎజిఎస్ | రూ. 8.06 లక్షలు |
ZXi | రూ. 8.29 లక్షలు |
ZXi ఎజిఎస్ | రూ. 8.79 లక్షలు |
ZXi+ | రూ. 8.99 లక్షలు |
ZXi+ ఎజిఎస్ | రూ. 9.49 లక్షలు |
ZXi+ డ్యూయల్ టోన్ | రూ. 9.14 లక్షలు |
ZXi+ ఎజిఎస్ డ్యూయల్ టోన్ | రూ. 9.64 లక్షలు |