- అధికారికంగా లభిస్తున్న రెండు ప్యాకేజీలు
- ఈ యాక్సెసరీస్ ని వ్యక్తిగతంగా కూడా పొందే అవకాశం
మారుతి సుజుకి కంపెనీ ఈ నెలలో ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ ని ఇండియాలో లాంచ్ చేసింది, అలాగే ఇందులో లభించే యాక్సెసరీస్ లిస్టును కూడా అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు, కార్ మేకర్ మారుతి స్విఫ్ట్ కారులో థ్రిల్ చేజర్ ప్యాక్, రేసింగ్ రోడ్ స్టర్ ప్యాక్ అనే రెండు ప్యాకేజీలలో అందించింది. వీటికి సంబంధించిన ధరలు మరియు ఫీచర్ లిస్టు వివరాలను ఒకసారి మనం పరిశీలిద్దాం.
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ యాక్సెసరీస్
కొత్త స్విఫ్ట్ లో కేవలం కాస్మోటిక్ అప్ డేట్లతో ఈ రెండు ప్యాకేజీలు అందించబడగా, వాటికి సంబంధించిన వివరాలు కస్టమర్లు చూసేందుకు వీలుగా ఉండేందుకు కార్ మేకర్ వెబ్ సైటులో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలు రూ. 29,500 ధరతో ప్రారంభం కాగా, ఇవి స్విఫ్ట్ అన్ని వేరియంట్లలో లభిస్తాయి. ఎక్స్టీరియర్ పరంగా ఈ యాక్సెసరీస్ ప్యాకేజీలలో కొన్ని గుర్తించదగిన ఫీచర్లలో బంపర్స్, బానెట్, మిర్రర్స్, మరియు డోర్స్ వంటి వాటిపై కాస్మోటిక్ అప్ డేట్లు ఉన్నాయి. ఇంటీరియర్ పరంగా డ్యాష్ బోర్డు, సెంటర్ కన్సోల్, డోర్ ప్యానెల్స్, మరియు సీట్లలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అలాగే ఇందులో స్పెషల్ కీ కూడా అందించబడింది. ఈ ప్యాకేజీలలో లభించే యాక్సెసరీలను కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా మారుతి సుజుకి అధికారిక వెబ్ సైట్ ద్వారా లేదా డీలర్ షిప్ నుంచి బుక్ చేసుకోవచ్చు.
థ్రిల్ చేజర్ ప్యాకేజ్ ఎక్విప్ మెంట్ (Z మరియు Z+ వేరియంట్ల ధర రూ.29,000)
యాక్సెసరీస్ | కలర్/ఫినిష్ |
ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ | |
ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ | గార్నిష్ ఫినిష్ |
ఫ్రంట్ గ్రిల్ ఇన్సర్ట్ | సిజ్లింగ్ రెడ్ |
రియర్ బంపర్ గార్నిష్ | మిడ్ నైట్ బ్లాక్ + క్రోమ్ ఫినిష్ |
బాడీ సైడ్ మౌల్డింగ్ | గార్నిష్ ఇన్సర్ట్ |
డోర్ వైజర్ | |
విండో ఫ్రేమ్ కిట్ | |
ట్రంక్ లిడ్ ప్రొటెక్టర్ | |
ఓఆర్విఎం ఆటో కవర్ | బ్లాక్ సర్క్యూట్– గ్రే స్ట్రైప్స్ |
హుడ్ + రూఫ్ గ్రాఫిక్స్ | బ్లాక్ సర్క్యూట్ |
డిజైనర్ మ్యాట్ | |
ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ | కార్బన్ + రెడ్ |
డోర్ సిల్ గార్డ్ | స్టెయిన్ లెస్ స్టీల్ |
సీట్ కవర్ ఎస్ ఎ బి | రెడ్ ఆర్కేడ్ హైలైట్(పియు) |
మాన్యువల్ ఓఆర్విఎం కవర్ | డార్క్ స్ట్రైప్స్ |
కీ కవర్ | రెడ్ డ్రిఫ్ట్ |
రేసింగ్ రోడ్ స్టర్ ప్యాకేజ్ ఎక్విప్ మెంట్ (LమరియుVవేరియంట్ల ధర రూ.35,000)
యాక్సెసరీస్ | కలర్/ఫినిష్ |
ఫ్రంట్ బంపర్ గార్నిష్ | సిజ్లింగ్ రెడ్ |
బాడీ సైడ్ మౌల్డింగ్ | గార్నిష్ఇన్సర్ట్ |
ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్ | మిడ్ నైట్ బ్లాక్ |
సైడ్అండర్ బాడీ స్పాయిలర్ | మిడ్ నైట్ బ్లాక్ |
రియర్ అండర్ బాడీ స్పాయిలర్ | మిడ్ నైట్ బ్లాక్ |
రియర్ అప్పర్ స్పాయిలర్ | మిడ్ నైట్ బ్లాక్ |
రియర్ మిడ్ గార్నిష్ | మిడ్ నైట్ బ్లాక్ |
వీల్ ఆర్చ్ కిట్ | మిడ్ నైట్ బ్లాక్ |
డోర్ వైజర్ | స్టెయిన్ లెస్ స్టీల్ఇన్సర్ట్ |
హుడ్ + రూఫ్ గ్రాఫిక్స్ | కార్బన్ డ్రిఫ్ట్ |
ఆల్-వెదర్ 3D మ్యాట్ | |
ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్ | |
ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ | కార్బన్+ రెడ్ |
ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్ |
వేరియంట్ వారీగా 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ ప్యాకేజీల ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
ప్యాకేజీలు & వేరియంట్లు | ధరలు |
థ్రిల్ చేజర్ ప్యాకేజీ Z మరియు Z+ | రూ. 29,500 |
థ్రిల్ చేజర్ ప్యాకేజీ L మరియు V | రూ. 32,000 |
రేసింగ్ రోడ్‌స్టర్ ప్యాకేజీ – నలుపు – Z మరియు Z+ | రూ. 31,000 |
రేసింగ్ రోడ్‌స్టర్ ప్యాకేజీ – బ్లాక్ – L మరియు V | రూ. 35,000 |
రేసింగ్ రోడ్‌స్టర్ ప్యాకేజీ – వైట్ – Z మరియు Z+ | రూ. 39,000 |
రేసింగ్ రోడ్‌స్టర్ ప్యాకేజీ – రెడ్ – L మరియు V | రూ. 40,500 |
రేసింగ్ రోడ్‌స్టర్ ప్యాకేజీ – వైట్ – L మరియు V | రూ. 40,500 |
2024 స్విఫ్ట్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లు
2024 స్విఫ్ట్ కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 80bhp మరియు 112Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఎఎంటి యూనిట్ తో జత చేసి పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్