- ఇండియాలో రూ.13.99 లక్షలతో ప్రారంభంకానున్న 2024 XUV700 ధరలు
- జనవరి 25 నుండి డీలర్స్ వద్దకు చేరుకోనున్న డెమో కార్లు
ఈ వారం ప్రారంభంలో, మహీంద్రా 2024 XUV700ని ఇండియాలో రూ.13.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఎస్‍యూవీ బయట మరియు లోపల చిన్నపాటి మార్పులను పొందింది, అయితే మేము ఈ ఆర్టికల్ లో ఈ 2024మోడల్ కి సంబంధించి టాప్ హైలైట్స్ ఏం ఉన్నాయో మీకు తెలియజేయబోతున్నాము.
కొత్త కలర్ ఆప్షన్లు
అప్‍డేటెడ్ XUV700 కొత్తగా నపోలి బ్లాక్ కలర్ ఆప్షన్ ని పొందగా, ఇంతకు ముందున్న ప్యాలెట్ కలర్ ప్రస్తుతం డ్యూయల్-టోన్ కలర్ లో అందుబాటులో ఉంది. ఇంకా చెప్పాలంటే, AX7 మరియు AX7Lవేరియంట్ల గ్రిల్, రూఫ్ రెయిల్స్, మరియు అల్లాయ్ వీల్స్ బ్లాక్ ఫినిష్ ని పొందాయి. అలాగే ఈ థీమ్ లోపల ఉన్న డార్క్ క్రోమ్ ఎయిర్ వెంట్స్ మరియు కన్సోల్ బెజెల్ కి కూడా ఉంది.
రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు
రీఫ్రెష్డ్ XUV700 పరిచయం ద్వారా, ఇప్పుడు ఈ ఎస్‍యూవీ రెండవ వరుసలో కెప్టెన్ సీట్ సెటప్ ని పొందింది. ప్రస్తుతం ఈ లేఅవుట్ ఎక్స్‌క్లూజివ్ గా AX7 మరియు AX7L వేరియంట్లలో మాత్రమే అందించబడింది.
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
దీని పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు XUV700లోని సెలెక్టెడ్ వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.
ఓటీఏ అప్‍డేట్స్
XUV700లోని ఎడ్రినో-ఎక్స్ సిస్టం అప్‍డేట్ అయి, ఇప్పుడు ఓటీఏ అప్‍డేట్స్ మరియు కొత్త ఫీచర్లతో కలిపి మొత్తం 83 కనెక్టెడ్ కార్ ఫీచర్లతో వచ్చింది.
మెమొరీ ఫంక్షన్ తో ఓఆర్‌విఎం
ఇది కేవలం AX7L వేరియంట్లో మాత్రమే అందించబడింది, కస్టమ్ సీట్ ప్రొఫైల్స్ కి మెమొరీ ఫంక్షన్ తో ఓఆర్‌విఎం లింక్ చేయబడింది.
గమనించాల్సిన అంశం ఏంటి అంటే, మహీంద్రా వైట్ గ్లోవ్ చాఫర్ ప్రోగ్రాంని తీసుకువచ్చింది మరియు ఇది XUV700 కోసం కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించి, ప్రొడక్షన్ కెపాసిటీని మెరుగుపరచనుంది. 2024 మహీంద్రా XUV700 బుకింగ్స్ జనవరి 15వ తేదీ నుంచి ప్రారంభంకాగా, జనవరి 25వ తేదీ నుంచి డెమో వెహికిల్స్ లోకల్ డీలర్స్ వద్దకు చేరుకోనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్