- కెప్టెన్ సీట్లతో అందుబాటులోకి వచ్చిన 2024 మోడల్
- ఆల్-న్యూ నపోలి బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్ దీని ప్రత్యేకత
మహీంద్రా నేడే తన ఫ్లాగ్ షిప్ ఎస్యూవీXUV700 యొక్క 2024 ఇటరేషన్ ను రూ.13.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త-సంవత్సరం అప్డేట్ తో, టాటా సఫారీతో పోటీ పడుతున్న ఈ 2024 మోడల్ ఇంటీరియర్ మార్పులను మాత్రమే కాకుండా, కొత్త ఎక్స్టీరియర్ కలర్ ను కూడా పొందింది. కొత్తగా పరిచయం చేయబడిన ఈ ఎస్యూవీ యొక్క బుకింగ్స్ ప్రారంభం కాగా, ఆసక్తి కలిగిన కస్టమర్లు దీనిని మీకు దగ్గరలో ఉన్న మహీంద్రా అధికారిక డీలర్ షిప్ ని సంప్రదించగలరు.
కొత్త అప్డేట్స్ పరంగా చెప్పాలంటే, 2024 XUV700స్పోర్ట్స్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ మెమొరీ ఓఆర్విఎం, మరియు రెండవ వరుసలో కెప్టెన్ సీట్లను పొందింది. ఇక AX7 మరియు AX7L వేరియంట్లలో మాత్రమే కెప్టెన్ సీట్లు అందుబాటులోకి రాగా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు AX7L వేరియంట్ కి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అదనంగా, 2024 XUV700 మోడల్ ఆల్-న్యూ నపోలి బ్లాక్ ఎక్స్టీరియర్ తో పాటుగా బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ ను పొందింది.
వేరియంట్-వారీగా 2024 మహీంద్రా XUV700 యొక్క ఎక్స్-షోరూం ధరలు ఈ కింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూం ధర |
MX | రూ. 13.99 లక్షలు |
AX3 | రూ. 16.39 లక్షలు |
AX5 | రూ. 17.69 లక్షలు |
AX7 | రూ. 21.29 లక్షలు |
AX7L | రూ. 23.99 లక్షలు |
ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, మహీంద్రా కంపెనీ XUV700ని ఆగస్టు 2021లో లాంచ్ చేయగా, అప్పటి నుంచి మహీంద్రా 1,40,000 యూనిట్ల XUV700 కార్లను విక్రయించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్