- న్యూ 11.4 - ఇంచ్ పిఐవిఐ ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ తో లభ్యం
- పెట్రోలు మరియు డీజిల్ రెండింట్లో లభించనున్నమోడల్
జెఎల్ఆర్ఇండియా 2024 ఇటరేషన్ లో వచ్చిన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ నుఇండియాలో లాంచ్ చేసింది. ఈ లగ్జరీఎస్‍యూవీధర రూ. 67.90 లక్షలు(ఎక్స్–షోరూం)నుండి ప్రారంభం కాగా, ( దీనిని పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలోపొందవచ్చు.
డిజైన్ మరియు స్టైలింగ్ పరంగాచూస్తే, ల్యాండ్ రోవర్ అప్‌డేటెడ్ డిస్కవరీ స్పోర్ట్ ఎక్స్‌టీరియర్ భాగంలో కొన్నిమార్పులను మాత్రమే అందుకుంద.ఇది గ్లోసీ ఫినిష్ తో ఆల్-బ్లాక్ మెష్ ఫ్రంట్ గ్రిల్, తాజాగా రూపొందించిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌ల్యాంప్‌లు మరియు ఒక కొత్త జత 21- ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఈ కొత్త లగ్జరీ ఎస్‍యూవీలో లోపల చూస్తే, ఇందులో అతి ప్రాముఖ్యమైన మార్పు ఏంటి అంటేమొబైల్ కనెక్టివిటీ మరియు అలెక్సా వాయిస్ అసిస్ట్‌తో కూడిన కొత్త 11.4- ఇంచ్ పిఐవిఐ ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త గేర్ సెలెక్టర్, మూడవ వరుసలో క్లైమేట్ కంట్రోల్, 3D సరౌండ్ వ్యూ కెమెరా మరియు క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ మరియు రియర్‌వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లను పొందింది.
దీని హుడ్ కింద, డిస్కవరీ స్పోర్ట్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తోలభిస్తుంది. అవి-2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ మొదటిది 245bhp మరియు 365Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, అయితే రెండోది 201bhp మరియు 430Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఈరెండూ పవర్ ట్రెయిన్స్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి నాలుగు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తాయి .
లాంచ్‌పై వ్యాఖ్యానిస్తూ, జెఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబ మాట్లాడుతూ,“డిజైన్ పరంగా కొత్త డిస్కవరీ స్పోర్ట్ వైవిధ్యంగా కనిపిస్తుండగా, లగ్జరీగా రోడ్లపై రైడ్ ని ఆస్వాదించే ఫ్యామిలీలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. విభిన్నమైన ఇంటీరియర్ తో డిస్కవరీ స్పోర్ట్ క్యారెక్టర్‌ఫుల్, మోడరన్, కాంపాక్ట్ ఎస్‍యూవీగా అనిపిస్తుంది. ఇది ప్రతి కుటుంబ ప్రయాణాన్ని అత్యంత సౌకర్యంగా మరియు సేఫ్టీగా ఉండేలా చేస్తుంది ” అని తెలియజేసారు.
అనువాదించిన వారు: రాజపుష్ప