- ఆటో స్టార్ట్-స్టాప్ టెక్‌ని పొందిన కొత్త సోనెట్
- ఏడీఏఎస్(ఎడాస్)ని కలిగి ఉన్న టాప్-స్పెక్ మోడల్
కియా సోనెట్ ఈ సంవత్సరం కాస్మెటిక్మార్పులు మరియు అనేక కొత్త ఫీచర్లతో ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను పొందింది. ఇది నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బో పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లతో అందించబడుతుంది.మేము దాని టాప్-స్పెక్ X లైన్ వెర్షన్ ని రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్ చేయడం ద్వారా ఫ్యూయల్ ఎఫిషియన్సీ నెంబర్లను పొందాము.
2024 కియా సోనెట్ పవర్‌ట్రెయిన్ వివరాలు
కాంపాక్ట్ ఎస్‌యువి మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ డిసిటితో జత చేయబడిన పవర్ ట్రెయిన్ పై మేము టెస్టింగ్ నిర్వహించాము .అలాగే, ఈ కార్ ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసిన మైలేజ్19.20కెఎంపిఎల్ కాగా, టెస్ట్ చేసిన తర్వాత ఇది ఎంత మైలేజ్ అందించిందో మనం చూద్దాం.
సిటీ మైలేజ్
సిటీరోడ్డుపై 76.4 కిలోమీటర్లు దూరంసోనెట్ని డ్రైవ్ చేస్తే 7.76 లీటర్ల పెట్రోల్ వినియోగించబడింది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ 10కెఎంపిఎల్ మైలేజీని చూపించగా, ఇది 9.9కెఎంపిఎల్ మైలేజీని అందించింది.
హైవే మైలేజ్
హైవే రోడ్డుపై, సోనెట్ ని 88.1కిలోమీటర్లు డ్రైవ్ చేయగా , 4.97 లీటర్స్ ఫ్యూయల్ ని వినియోగించి 17.7కెఎంపిఎల్ మైలేజీని అందించింది.అది టాకోమీటర్‌లో సూచించిన విధంగా 18కెఎంపిఎల్ కి దగ్గరగా ఉంటుంది.ఈ మైలేజ్ 1,180కిలో బరువున్న కాంపాక్ట్ పెట్రోల్ ఎస్‌యువికి తగ్గట్టుగా ఉంది మరియు ఆటోమేటిక్ సౌకర్యాన్ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప