- డిసెంబర్ 14న లాంచ్ కానున్న కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్
- ఈ సెగ్మెంట్లో ఏడీఏఎస్ ఫీచర్స్ తో వస్తున్న రెండవది మాత్రమే
కియా ఇండియా ఫేస్‍లిఫ్టెడ్ సోనెట్ ని ఇంకా ఆవిష్కరించనే లేదు, కానీ మేము దానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని సేకరించి మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాము. ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ లెవెల్-1 ఏడీఏఎస్ పొందనుంది మరియు అధికారిక లాంచ్ కు ముందే కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క టాప్-10 ఫీచర్స్ లిస్టును సిద్ధం చేసి మీకోసం ఎక్స్‌క్లూజివ్ గా అందిస్తున్నాము.
కియా సోనెట్ ఏడీఏఎస్ లెవెల్ ఫీచర్స్ వివరాలు
1.ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్(ఎఫ్‍సిడబ్ల్యూ)
ఏవైనా ఊహించని అడ్డంకులు మీకు ఎదురుగా ఉంటే కారు మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
2. ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్- కార్ (ఎఫ్‍సిఎ-కార్)
మీ కారు ఏదైనా వాహనంతో ఢీకొనడానికి ముందు మిమ్మల్ని హెచ్చరించడమే కాకుండా, వాటంతట అదేబ్రేక్‌లను కూడా వేస్తుంది.
3. ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – సైకిల్ (ఎఫ్‍సిఎ- సైక్లిస్ట్)
కొత్త సోనెట్ సైక్లిస్ట్ లను సైతం గుర్తిస్తుంది, ఢీకొనకుండా వార్న్ చేస్తుంది మరియు బ్రేక్స్ అప్లై చేస్తుంది.
4. ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – పెడెస్ట్రియన్ (ఎఫ్‍సిఎ- పెడెస్ట్రియన్)
అదనంగా, కారు పాదచారులను ఢీకొనకుండా ప్రమాదం గురించి మిమ్మల్ని ముందే హెచ్చరిస్తుంది మరియు మీరు సకాలంలో సరిగా స్పందించకపోతే త్వరగా బ్రేక్స్ కూడా అప్లై చేస్తుంది.
5.లేన్ కీప్ అసిస్ట్ (ఎల్‍కెఎ)
మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే 2024 సోనెట్ మిమ్మల్ని ఆటోమేటిక్‌గా మీ లేన్‌కి తిరిగి మిమ్మల్ని మళ్లిస్తుంది.
6. లేన్ డిపార్చర్ వార్నింగ్ (ఎల్‍డిడబ్ల్యూ)
మీరు ఇండికేటర్ లేకుండా మీ లేన్ నుండి దూరంగా వెళ్లడం ప్రారంభిస్తే కూడా కారు మీకు దీని ద్వారా తెలియజేస్తుంది.
7. లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ (ఎల్‍ఎఫ్ఎ)
ఇది రహదారి లేన్స్ ను గుర్తించడమే కాకుండా మిమ్మల్ని అటు ఇటు వెళ్ళకుండా రోడ్డు మధ్యలో సరిగ్గా వెళ్ళేలా కూడా చేయగలదు.
8. లీడింగ్ వెహికిల్ డిపార్చర్ అలర్ట్ (ఎల్‍విడిఎ)
ఏడీఏఎస్ సహాయంతో, సొనెట్ ముందు ఉన్న వాహనం యొక్క కదలికను అనుసరిస్తుంది. ముందు వాహనం కదలడం ప్రారంభిస్తే అది మీకు తెలియజేస్తుంది.
9. హై బీమ్ అసిస్ట్ (హెచ్‍బిఎ)
మరో సహజమైన ఫీచర్ ఏంటి అంటే, కారు హెడ్‌లైట్స్ ఆటోమేటిక్‌గా ముందున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఉంటాయి.
10. డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ (డిఎడబ్ల్యూ)
అన్ని ఇతర వార్నింగ్స్ తో పాటు, డ్రైవర్ అటెన్షన్ లో ఏదైనా లోపం ఉంటే దాని గురించి మీకు మరొక వార్నింగ్ ఇస్తుంది.
2024 కియా సోనెట్ ఇంజిన్ ఆప్షన్స్
పవర్డ్ 2024 కియా సోనెట్ ఒకే రకమైన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, మరియు పెప్పీ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ అనే ట్రయో ఇంజిన్స్ తో అందుబాటులోకి రానుంది. అదే విధంగా కార్‌మేకర్ సోనెట్‌ను విభిన్నమైన ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో అందించడం కొనసాగిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు సున్నితమైన 7-స్పీడ్ డిసిటి యూనిట్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్