- పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ రెండింట్లో లభిస్తున్న మోడల్
- ఈ వేరియంట్లలో రియర్ డీఫాగర్‌తో పాటు సన్‌రూఫ్ ని కూడా అందిస్తున్న కియా
కియా ఇండియా ఇండియాలో 2024 సోనెట్‌ను లాంచ్ చేసింది. దీనిని రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. అదనంగా, ఆటోమేకర్ సన్‌రూఫ్‌తో కూడిన 4 కొత్త వేరియంట్‌లను కూడా లాంచ్ చేయగా, ఈ ఆర్టికల్ లో మనం వాటి వివరాలను పరిశీలిద్దాం.
కియా ఇండియా సోనెట్ లో సన్‌రూఫ్ వంటి మోస్ట్ పాపులర్ప్రీమియం ఫీచర్‌లను జోడించి, 4 కొత్త ఎంట్రీ లెవెల్ మరియు మిడ్ లెవెల్ వేరియంట్‌లను పరిచయం చేసింది. HTE(O), HTK(O) ఈ రెండు వేరియంట్‌లు ఇప్పుడు పెట్రోల్ G1.2 మరియు డీజిల్ 1.5 సిఆర్ డిఐ విజిటి అనే ఇంజిన్‌లతో అందుబాటులో ఉన్నాయి. అలాగే, HTK(O) వేరియంట్ లో సన్‌రూఫ్, ఎల్ఈడీ కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఫీచర్లను అందించగా, ప్రస్తుతం ఉన్న HTK వేరియంట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో రియర్ డీఫాగర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
అదనంగా, కియా ఇండియా ఇప్పుడు GTX+ మరియు HTX+ అనే వేరియంట్‌లలో ఆల్-విండోస్ అప్/డౌన్ సేఫ్టీని అందిస్తోంది. ఇంకా, HTE మరియు HTK వేరియంట్‌లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఇప్పుడు దీనిని -అరోరా బ్లాక్ పెర్ల్, ఇంపీరియల్ బ్లూ మరియు ప్యూటర్ ఆలివ్ మూడు కొత్త కలర్స్ నుండి ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, కియా జోడించిన ఈ వేరియంట్‌లు మరియు ఫీచర్‌లతో కలిపి, ఇండియన్ ఎస్‍యూవీ కొనుగోలుదారులకు సోనెట్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
వేరియంట్ వారీగా 2024 కియా సోనెట్ ఎక్స్-షోరూమ్ ధరలు మరియు ఫీచర్లు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఆడిషన్ ఫీచర్స్ |
GTX+ | అన్ని విండోస్ అప్/డౌన్ సేఫ్టీ |
HTX+ | |
HTK (O) | సన్‌రూఫ్, ఎల్ఈడీ కనెక్ట్ టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్,రియర్ డీఫాగర్ |
HTE (O) | సన్‌రూఫ్ |
HTE, HTK | కార్ కలర్: అరోరా బ్లాక్, ఇంపీరియల్ బ్లూ, ప్యూటర్ ఆలివ్ |
HTK+ | కలర్ అప్‌గ్రేడ్: క్లియర్ వైట్ టూ పెర్ల్ వైట్ |
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | వేరియంట్ | ధర (ఎక్స్-షోరూమ్) |
స్మార్ట్ స్ట్రీమ్ G1.2 | 5ఎంటి | HTE | రూ.79,9000 |
HTE (O) | రూ.81,9000 | ||
HTK | రూ. 88,9000 | ||
HTK (O) | రూ. 924,900 | ||
HTK+ | రూ. 999,900 | ||
స్మార్ట్ స్ట్రీమ్ G1.0T-GDi | ఐఎంటి | HTK+ | రూ. 10,55,900 |
HTX | రూ. 11,55,900 | ||
HTX+ | రూ. 13,49,900 | ||
7డిసిటి | HTX | రూ. 12,35,900 | |
GTX+ | రూ. 14,54,900 | ||
ఎక్స్-లైన్ | రూ. 14,74,900 | ||
1.5L సిఆర్ డిఐ విజిటి | 6 ఎంటి | HTE | రూ. 97,9900 |
HTE (O) | రూ. 99,9900 | ||
HTK | రూ. 10,49,900 | ||
HTK (O) | రూ. 10,84,900 | ||
HTK+ | రూ. 11,44,900 | ||
HTX | రూ. 12,09,900 | ||
HTX+ | రూ. 13,79,900 | ||
6 ఐఎంటి | HTX | రూ. 12,69,900 | |
HTX+ | రూ. 14,49,900 | ||
6ఏటీ | HTX | రూ. 13,09,900 | |
GTX+ | రూ. 15,54,900 | ||
ఎక్స్-లైన్ | రూ. 15,74,900 |
అనువాదించిన వారు: రాజపుష్ప