- ప్రస్తుతం సోనెట్ కొత్త వేరియంట్ సేల్స్ షురూ చేసిన కియా
- ధర మరియు ఫీచర్ల పరంగా HTX+ మరియు GTX+ వేరియంట్ల మధ్య వచ్చిన GTX వేరియంట్
కియా మోటార్స్ దాని బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన సోనెట్ లైనప్ ని కొత్త GTX వేరియంట్ తో రీఫ్రెష్ చేసింది. అయితే, HTX+ మరియు GTX+ వేరియంట్ల మధ్య పొజిషన్ చేయబడ్డ ఈ కొత్త వేరియంట్లో మనకు లభించే టాప్-5 ఫీచర్లు ఏమేం ఉన్నాయో తెలుసుకుందాం.
కొత్త కలర్ ఆప్షన్
సోనెట్ GTX వేరియంట్ లో ఇప్పుడు కొత్త అరోరా బ్లాక్ పెర్ల్ కలర్ కూడా తోడవడంతో సోనెట్ లైనప్ లో ఉన్న కలర్ల సంఖ్య ఏడుకు చేరింది. కొత్త సోనెట్ ని ఇప్పుడు స్పార్క్లింగ్ సిల్వర్, సిగ్నేచర్ప్యూటర్ ఆలివ్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ మరియు గ్లేసియర్ వైట్ పెర్ల్ అనే ఏడు కలర్లలో పొందవచ్చు.
360-డిగ్రీ కెమెరా
సోనెట్ లోని కొత్త GTX వేరియంట్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ లో బ్లైండ్-వ్యూ మానిటర్ తో 360-డిగ్రీ కెమెరాని పొందింది.
పవర్డ్ డ్రైవర్ సీట్
GTX వేరియంట్లోని డ్రైవర్ సీటును మన సౌకర్యానికి అనుగుణంగా ఎలక్ట్రికల్లీ పవర్డ్ సహాయంతో నాలుగు విధాలుగా చేంజ్ చేసుకోవచ్చు.
వెంటిలేషన్ ఆప్షన్
ఇందులోని బ్లాక్ మరియు బ్రౌన్ లెదరెట్ సీట్లు వెంటిలేషన్ ఆప్షన్ ని పొందగా, ఇది యూజర్లను ఓ వరమని చెప్పవచ్చు. ఎందుకంటే వెంటిలేషన్ సీటుపై కూర్చున్న సమయంలో వెంటిలేషన్ ని అందిస్తుంది. అయితే, ఇక్కడ ట్విస్టు ఏంటి అంటే, ఇది కేవలం ఫ్రంట్ సీట్లకు మాత్రమే పరిమితం చేయబడింది.
ఎయిర్ ప్యూరిఫైయర్
ఈ వేరియంట్లో ప్రత్యేకంగా అందించబడిన స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ వైరస్ మరియు బాక్టీరియా వంటి క్రిముల నుంచి యూజర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది.
సోనెట్ GTX ఇంజిన్ ఆప్షన్లు
సోనెట్ GTX వేరియంట్ రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడింది. అందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. అయితే, ఈ రెండు కేవలం ఆటోమేటిక్ గేర్ బాక్సులతో మాత్రమే అందించబడ్డాయి. టర్బో-పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి రాగా, డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జతచేయబడి వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్