- డిసెంబర్ 14న లాంచ్ కానున్న సోనెట్ ఫేస్‌లిఫ్ట్
- అందుబాటులో ఉన్న 7 వేరియంట్స్ మరియు 11 కలర్స్
ఈరోజు ప్రారంభంలో, రాబోయే కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ యొక్క బ్రోచర్ వెబ్‌లో లీక్ అయ్యింది. ఈ డాక్యుమెంట్లో వేరియంట్ లైనప్, కలర్ ఆప్షన్‌లు, వేరియంట్ వారీ ఫీచర్స్ మరియు టెక్నికల్ స్పెసిఫికేషన్‌లతో సహా అన్ని వివరాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్‌లో, ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను పరిశీలిద్దాం.
క్రింది హుడ్ లో వివరాలను చూస్తే , 2024 కియా సోనెట్ మూడు ఇంజిన్‌లతో లాంచ్ అవ్వనుంది. ఇందులోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో మాత్రమే జతచేయబడి 82bhp మరియు 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులోని 1.5-లీటర్ డీజిల్ మిల్, 114bhp మరియు 250Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, అలాగే ఇందులో6-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ ఐఎంటి యూనిట్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌తో అందుబాటులో ఉన్నాయి.
రాబోయే సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 1.0-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ ఐఎంటి యూనిట్ లేదా 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో జతచేయబడి రానుంది, అలాగే దీని మోటార్ 118bhp మరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్ మరియు బ్రెజాతో పోటీ పడుతున్న ఇది 11 కలర్ ఆప్షన్స్ మరియు 7 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది, వాటి వివరాలు ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప