- కొత్త వేరియంట్లతో వచ్చిన కొత్త వేరియంట్
- ఇప్పుడు ఏడు కలర్లతో కియా సెల్టోస్ లభ్యం
కియా ఇండియా దాని పోర్ట్ ఫోలియోను అప్ డేట్ చేస్తూ, సెల్టోస్ మరియు సోనెట్ లైనప్ ని రీఫ్రెష్ చేసింది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా సెల్టోస్ లోని కొత్త GTX వేరియంట్లో లభించే టాప్-5 ఫీచర్లు ఏమేం ఉన్నాయో వాటి వివరాలు తెలుసుకుందాం.
ఎడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం)
ఇంతకు ముందు, ఎడాస్(అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) ఫీచర్ కేవలం టాప్ వేరియంట్లకు మాత్రమే రిజర్వ్ చేయబడి ఉండేది. అయితే, ధర మరియు ఫీచర్ల పరంగా GTX+ వేరియంట్ పై స్థానంలో ఉండగా, ఇప్పుడు కొత్త GTX వేరియంట్ రాకతో, ఇందులో కూడా అటానమస్ టెక్ ఫీచర్ అందించబడింది.
R18 అల్లాయ్స్
సెల్టోస్ HTX+ వేరియంట్ 17-ఇంచ్ అల్లాయ్స్ తో రాగా, దీనిలా కాకుండా GTX వేరియంట్ లభించే కొత్త 18-ఇంచ్ క్రిస్టల్-కట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ద్వారా రైడ్ ని ఎంజాయ్ చేయవచ్చు.
వెంటిలేటెడ్ సీట్లు
GTX వేరియంట్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు లభించే మరో అదనపు ఫీచర్ ఏంటి అంటే, ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను పొందుతుంది. ఈ ఫీచర్ వేడి (హాట్) మరియు వాతావరణం తేమగా ఉన్న సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
ఈ కారును మరింత సౌకర్యాన్ని జోడిస్తూ కియా కంపెనీ GTX వేరియంట్లో డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ని తీసుకువచ్చింది.
కొత్త కలర్
చివరగా చెప్పాలంటే, సోనెట్ లాగే సెల్టోస్ కూడా స్టాండర్డ్ ఎక్స్ టీరియర్ కలర్ ఆప్షన్లలో భాగంగా కొత్త కలర్ ని పొందింది. అరోరా బ్లాక్ పెర్ల్ అనే కొత్త కలర్ ని కియా కార్ల సంస్థ సెల్టోస్ లోని ఈ వేరియంట్లో తీసుకువచ్చింది. దీంతో ఇప్పుడు సెల్టోస్ కారును ఏడు కలర్లలో పొందవచ్చు.
సెల్టోస్ GTX పవర్‌ట్రెయిన్ ఆప్షన్
కియా సెల్టోస్ GTX వేరియంట్ 1.5- లీటర్ టర్బో- పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. అయితే, ట్రాన్స్ మిషన్ ఆప్షన్ల పరంగా, ఇది కేవలం ఆటోమేటిక్ వెర్షన్లలో మాత్రమే అందించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్