- రెండు వేరియంట్లలో లభ్యం
- సింగిల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ తో లభ్యం
కియా ఇండియా 2024 కార్నివాల్ వివరాలతో దాని వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసింది. అక్టోబర్ 3వ తేదీన EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యువితో పాటు లగ్జరీ ఎంపివిని కూడా ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ మోడల్ ఫోర్త్-జనరేషన్ కార్నివాల్ గా ఇండియన్ మార్కెట్ లోకి రానుంది. ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం నుండి వార్తలలో వినిపిస్తుండగా, మొత్తానికి ఇప్పుడు కియా ఇండియా దీనిని అధికారికంగా ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తోంది. అలాగే , కొత్త కార్నివాల్ లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.ఇక్కడ, మేము ఎంపివి వేరియంట్లకి సంబంధించిన ఫీచర్స్ ను వివరించాము. మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదివి తెలుసుకోవచ్చు.
ఇంకా ఫీచర్ల విషయానికొస్తే, లిమోసిన్ వేరియంట్‌లో 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటో ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డ్యూయల్ సన్‌రూఫ్, 12-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 8-వే పవర్డ్ కో-డ్రైవర్ సీట్, ఎలక్ట్రికల్లీ స్లైడింగ్ రియర్ డోర్స్, డ్యాష్‌లో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, డ్రైవ్ మోడ్స్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, ఈఎస్‍పీ, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్స్ మరియు సరౌండ్-వ్యూ కెమెరా సిస్టమ్ వంటివి ఉన్నాయి.
ఇంతేకాకుండా, ఈ వేరియంట్ లెవెల్-2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ ని కూడా పొందుతుంది. అలాగే, ఇందులో కొలిజన్ అవాయిడెన్స్ తో లేన్ మార్పు వార్నింగ్ మరియు డ్రైవింగ్ అసిస్టెంట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రియర్-క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మరియు మరిన్ని వంటి సాధారణమైన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
లిమోసిన్ వేరియంట్ కంటే లిమోసిన్ ప్లస్ వేరియంట్‌లో లభించే కొన్ని అదనపు ఫీచర్లు ఏమిటంటే, 12-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల రెండవ-వరుస సీట్స్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఎల్ఈడీ రియర్ ఫాగ్ లైట్స్ మరియు పడిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప