- 30 వేరియంట్‌లలో లభించనున్నమోడల్
- డీజిల్ పవర్‌ట్రెయిన్ ఇప్పుడు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యం
కియా ఇండియా కొత్త వేరియంట్‌ల పరిచయంతో కారెన్స్ లైనప్‌ను అప్‌డేట్ చేయడమే కాకుండా ఫీచర్ లిస్ట్ ని కూడా మెరుగుపరిచింది. అలాగే, ఈ మూడు-వరుసల ఎంపివిని ఇప్పుడు 1.5-లీటర్ డీజిల్ మిల్ తో జతచేయబడి ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పొందవచ్చు. అంతే కాకుండా, టాప్-స్పెక్ ఎక్స్-లైన్ వేరియంట్స్ లో డాష్‌క్యామ్, వాయిస్ కమాండ్‌లతో అన్ని విండోస్ ఆటోమేటిక్ గా పైకి క్రిందికి ఆపరేట్ చేయవచ్చు మరియు సెవెన్-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఫీచర్లతో దీనిని పొందవచ్చు.
కొత్త వేరియంట్స్ లోని, సెవెన్-స్పీడ్ డిసిటి మరియు 6-స్పీడ్ ఏటీ ఆప్షన్స్ లో ప్రెస్టీజ్+(O) వేరియంట్ సన్‌రూఫ్, ఎల్ఈడీ మ్యాప్ ల్యాంప్ మరియు రూమ్ ల్యాంప్ వంటి ఫీచర్లతో లోడ్ చేయబడింది. ప్రెస్టీజ్(O) వేరియంట్ ఆరు లేదా 7-సీటింగ్ కెపాసిటీతో పాటు లెదర్‌తో చుట్టబడిన గేర్ నాబ్, పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్, ఎల్ఈడీ డిఆర్ఎల్ మరియు పొజిషనింగ్ ల్యాంప్ వంటి ఆప్షన్స్ ను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ వేరియంట్‌లో కీలెస్ ఎంట్రీ, 8-ఇంచ్ డిజిటల్ ఆడియో సిస్టమ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్టీరింగ్ వీల్-మౌంటెడ్ రిమోట్ కంట్రోల్, బర్గ్లర్ అలారం మరియు స్ట్రాంగ్ సేఫ్టీ ఫీచర్లు వంటివి ఉన్నాయి.
ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ కియా కారెన్స్ లో ప్యూటర్ ఆలివ్ పెయింట్ షేడ్‌ను పరిచయం చేసింది. మారుతి సుజుకి XL6 మోడల్ కి పోటీగా ఉన్న దీనిని కస్టమర్లు 8 మోనోటోన్ మరియు మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌ల నుండి ఎంచుకోవచ్చు. ఇందులో క్లియర్ వైట్, గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ మరియు డార్క్ గన్ మెటల్ మ్యాట్ కలర్స్ ఉన్నాయి.
వేరియంట్ వారీగా కియా కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | సీటింగ్ కెపాసిటీ | వేరియంట్ | ధర (ఎక్స్-షోరూమ్) |
G1.5 | 6ఎంటి | 7 | ప్రీమియం | రూ.10,51,900 |
ప్రీమియం(O) | రూ.10,91,900 | |||
ప్రెస్టీజ్ | రూ.11,96,900 | |||
ప్రెస్టీజ్ (O) | రూ.12,11,900 | |||
6 | ప్రెస్టీజ్ (O) | రూ.1,211,900 | ||
K1.5 | 6ఐఎంటి | 7 | ప్రీమియం(O) | రూ.12,41,900 |
ప్రెస్టీజ్ | రూ.13,61,900 | |||
ప్రెస్టీజ్+ | రూ.14,91,900 | |||
లగ్జరీ | రూ.16,71,900 | |||
లగ్జరీ+ | రూ.17,81,900 | |||
7 డిసిటి | ప్రెస్టీజ్+(O) | రూ.16,11,900 | ||
లగ్జరీ+ | రూ.18,71,900 | |||
ఎక్స్-లైన్ | రూ.19,21,900 | |||
6ఐఎంటి | 6 | లగ్జరీ+ | రూ.17,76,900 | |
7 డిసిటి | లగ్జరీ+ | రూ.18,66,900 | ||
ఎక్స్-లైన్ | రూ.19,21,900 | |||
U1.5 | 6ఎంటి | 7 | ప్రీమియం | రూ.12,66,900 |
ప్రీమియం(O) | రూ.12,91,900 | |||
ప్రెస్టీజ్ | రూ.14,01,900 | |||
ప్రెస్టీజ్+ | రూ.15,46,900 | |||
లగ్జరీ | రూ.17,16,900 | |||
లగ్జరీ+ | రూ.18,16,900 | |||
6 ఐఎంటి | లగ్జరీ | రూ.17,26,900 | ||
లగ్జరీ+ | రూ.18,36,900 | |||
6ఎటి | ప్రెస్టీజ్+(O) | రూ.16,56,900 | ||
లగ్జరీ+ | రూ.19,11,900 | |||
U1.5 | 6ఎంటి | 6 | లగ్జరీ+ | రూ.18,16,900 |
6 ఐఎంటి | 6 | లగ్జరీ+ | రూ.18,36,900 | |
6ఎటి | లగ్జరీ+ | రూ.19,21,900 | ||
ఎక్స్-లైన్ | రూ.19,66,900 |
అనువాదించిన వారు: రాజపుష్ప