- రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ డిజైన్ ని పొందనున్న అప్‍డేటెడ్ V-క్రాస్
- ఇంజిన్, స్పెసిఫికేషన్ల పరంగా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం
మరికొన్ని వారాల్లో ఇసుజు మోటార్ ఇండియా 2024V-క్రాస్ ని లాంచ్ చేయనుండగా, దాని కంటే ముందుగా ఈ మోడల్ కి సంబంధించి మొదటి టీజర్ ని షేర్ చేసింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ టీజర్ వీడియో ద్వారా ఈ అప్‍డేటెడ్ మోడల్ కి సంబంధించిన కీలక ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ వివరాలు వెల్లడయ్యాయి.
వీడియోలో చూసిన విధంగా, కొత్త ఇసుజు V-క్రాస్ మోడల్ కొత్త ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్, గన్ మెటల్ ఫినిషింగ్ తో అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిషింగ్ తో ఫాగ్ లైట్ సరౌండ్, రివైజ్డ్ రన్నింగ్ బోర్డ్, వీల్ క్లాడింగ్, మరియు సిల్వర్ రూఫ్ రెయిల్స్ వంటి వాటిని పొందనుంది.
ఇంటీరియర్ పరంగా, V-క్రాస్ మోడల్ లోపల ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, బ్లాక్ మరియు సిల్వర్ డ్యాష్ బోర్డ్, మరియు బ్రౌన్ మరియు బ్లాక్ అప్హోల్స్టరీ థీమ్ ని అందుకోనుంది. గుర్తించదగిన ముఖ్యమైన ఇతర అంశాలలో రోటరీ ఏసీ కంట్రోల్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, వర్టికల్ స్టాక్డ్ టెయిల్ లైట్స్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో హెడ్ ల్యాంప్స్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, మరియు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
బానెట్ కింద, అప్‍డేటెడ్ ఇసుజు V-క్రాస్ మోడల్ ఇంతకు ముందు లాగే 161bhp పవర్ మరియు 360Nm టార్కును ఉత్పత్తి చేసే 1.9-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉంది. ఇక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 4x3 మరియు 4x4 వెర్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్లతో అందించబడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్