- కొత్త ఫీచర్లు, ట్వీక్డ్ డిజైన్ ని పొందిన అప్డేటెడ్ వి-క్రాస్ మోడల్
- కొత్తగా పరిచయం చేయబడిన ప్రెస్టీజ్ వేరియంట్
ఇసుజు మోటార్ ఇండియా కంపెనీ 2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ని దేశవ్యాప్తంగా రూ.21.20 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అప్డేటెడ్ పిక్-అప్ వెహికిల్ అప్ డేట్స్ పరంగా చిన్న చిన్న మార్పులతో పాటు ఫీచర్లను కూడా పొందింది. ప్రస్తుతం కారు బుకింగ్స్ ప్రారంభమవగా, త్వరలో వీటి డెలివరీ కూడా ప్రారంభంకానుంది.
ఎక్స్టీరియర్ పరంగా, 2024 ఇసుజు డి-మ్యాక్స్ బయట వైపు ఫ్రంట్ బంపర్ గార్డ్, ఇంజిన్ హుడ్ గార్నిష్, కొత్త గ్రిల్, మరియు బ్లాక్డ్-అవుట్ వీల్స్ ని పొందింది. అలాగే, కారులోని కొన్ని భాగాలైన ఫెండర్ లిప్, ఫ్రంట్ మరియు రియర్ వీల్ ఆర్చెస్, ఫాగ్ లైట్స్, రియర్ బంపర్, రూఫ్ రెయిల్స్, మరియు ఓఆర్విఎం వంటివి డార్క్ గ్రే ఫినిష్ తో అందించబడ్డాయి.
ఇంటీరియర్ పరంగా, రీఫ్రెష్డ్ ఇసుజు వి-క్రాస్ లోపల ట్రాక్షన్ కంట్రోల్, ఈఎస్సీ, హెచ్డీసీ, హెచ్ఎస్ఏ, రియర్ ఆక్యుపెంట్స్ కోసం త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, రియర్ సీట్ ఆక్యుపెంట్ డిటెక్షన్ సెన్సార్స్, మరియు రియర్ సీట్ల కోసం అడ్జస్టబుల్ రిక్లైన్ ఫంక్షన్ వంటి అప్డేట్స్ పొందింది. గుర్తించదగిన ఇతర ముఖ్యమైన ఫీచర్లలో వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కోసం 9-ఇంచ్ టచ్ స్క్రీన్ యూనిట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టం, రివర్స్ పార్కింగ్ కెమెరా, షిఫ్ట్-ఆన్-ప్లై 4డబ్లూడీ సిస్టం, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటివి ఉన్నాయి.
బానెట్ కింద, కొత్త వి-క్రాస్ 163bhp మరియు 360Nm టార్కును ఉత్పత్తి చేసే 1.9-లీటర్,4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో రాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లతో జతచేయబడింది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు దీనిని 4x2 మరియు 4x4 వెర్షన్ల నుండి ఎంచుకోవచ్చు.
వేరియంట్-వారీగా 2024 ఇసుజు వి-క్రాస్ (ఎక్స్-షోరూం, చెన్నై) ధరలు కింది విధంగా ఉన్నాయి:
వేరియంట్ | ధర (ఎక్స్-షోరూం) |
2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ హై-లాండర్ | రూ. 21.20 లక్షలు |
2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ 2WD ఎటి Z | రూ. 25.80 లక్షలు |
2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ 4WD ఎంటి Z | రూ. 25.52 లక్షలు |
2024 ఇసుజు డి-మ్యాక్స్ విక్రాస్ 4WD ఎంటి Z ప్రెస్టీజ్ | రూ. 26.92 లక్షలు |
2024 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ 4WD ఎటి Z ప్రెస్టీజ్ | రూ. 30.96 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్