- న్యూ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను పొందనున్న క్రెటా ఫేస్‌లిఫ్ట్
- వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అవుతున్నదని అంచనా
హ్యుందాయ్ కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో పరిచయం చేయనుంది. దీని ప్రారంభానికి ముందు, ఈ మోడల్ పబ్లిక్ రోడ్ టెస్ట్ సమయంలో కనిపించగా, ప్రధానంగా గ్రాండ్ విటారా మరియు సెల్టోస్ తో పోటీ పడుతున్న దీనికి సంబంధించిన తాజా వివరాలు వెల్లడయ్యాయి.
ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా అంతటా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉంది. మనకు కనిపిస్తున్న అంశాలను గమనిస్తే ఇందులో కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్రెయిల్స్, కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు డిఆర్ఎల్ఎస్, కొత్త గ్రిల్, ఫ్రంట్ బంపర్‌పై ఏడీఏఎస్ సెన్సార్, ఎ-పిల్లర్ మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి.
లోపల వైపు, అప్‌డేటెడ్ క్రెటాలో రీవర్క్ చేయబడిన ఇంటీరియర్ థీమ్, ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ కెమెరా మరియు కొత్త అప్హోల్స్టరీని పొందవచ్చు. ఇది ఇప్పటికే పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్రైవ్ మోడ్‌లు వంటి ఫీచర్లను పొందింది.
హుడ్ కింద, 2024 హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం ఉన్న అవుట్‌గోయింగ్ వెర్షన్ పవర్ ట్రెయిన్స్ సెట్ వలె 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లతో కొనసాగే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప