- ఇండియాలో రూ.11 లక్షలతో ప్రారంభంకానున్న క్రెటా ఫేస్లిఫ్ట్ ధరలు
- 7 వేరియంట్లు మరియు 7 కలర్లలో లభ్యం
ఈ వారం ప్రారంభంలో హ్యుందాయ్ కంపెనీ రూ.11 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో క్రెటా ఫేస్లిఫ్ట్ ఇండియాలో లాంచ్ చేసింది. 7 వేరియంట్లు మరియు 7 కలర్లలో అందించబడుతున్న ఈ మోడల్ డెలివరీ త్వరలోనే ప్రారంభం కావచ్చని మేము భావిస్తున్నాము.
2024 హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో అందించబడుతుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్లు ఉన్నాయి. క్రెటాలోని ప్రతి వెర్షన్ యొక్క మైలేజీ వివరాలను కూడా షేర్ చేశాము. వాటి వివరాలు కార్వాలే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
వేరియంట్-వారీగా కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ ఆన్-రోడ్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సిటీ | బేస్ మోడల్ | టాప్ మోడల్ |
హైదరాబాద్ | రూ. 13.62 లక్షలు | రూ. 25.00 లక్షలు |
విజయవాడ | రూ. 13.60 లక్షలు | రూ. 24.97 లక్షలు |
ముంబై | రూ. 13.10 లక్షలు | రూ. 24.46 లక్షలు |
ఢిల్లీ | రూ.12.89 లక్షలు | రూ. 23.93 లక్షలు |
చెన్నై | రూ. 13.75 లక్షలు | రూ. 25.42 లక్షలు |
కోల్ కతా | రూ. 12.85 లక్షలు | రూ. 23.39 లక్షలు |
బెంగళూరు | రూ. 13.30 లక్షలు | రూ. 24.81 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 12.19 లక్షలు | రూ. 22.58 లక్షలు |
పూణే | రూ. 13.10 లక్షలు | రూ. 24.46 లక్షలు |
కొచ్చి | రూ. 13.39 లక్షలు | రూ. 25.78 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్