- జనవరి 16న కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‍లిఫ్ట్ ధరలు వెల్లడి
- కొత్తగా ఈ రేంజ్ లోకి చేరనున్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్
జనవరి 16న జరగనున్న దాని లాంచ్ కి ముందే, హ్యుందాయ్ అధికారికంగా క్రెటా ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్ ని జనవరి 2వ తేదీన అనగా మంగళవారం నాడు ప్రారంభించింది. ఇందులో కొత్త విశేషం ఏమిటి అంటే, తాజాగా హ్యుందాయ్ కంపెనీ దీని బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి దీపికా పదుకునేని ప్రకటించింది.
కలర్స్ పరంగా చెప్పాలంటే, ఫేస్‍లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా 6 మోనోటోన్ కలర్స్ మరియు బ్లాక్ రూఫ్ తో అట్లాస్ వైట్ అనే ఒక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ లో అందుబాటులోకి రానుంది. ఇక మోనోటోన్ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్ (న్యూ), ఫియరీ రెడ్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్ మరియు టైటాన్ గ్రే కలర్స్ లో అందుబాటులోకి రానుంది.
అదే విధంగా, వేరియంట్స్ విషయానికి వస్తే, 2024 క్రెటాను E, EX, S, S(O), SX, SX టెక్, మరియు SX (O) అనే 7 వేరియంట్లలో కస్టమర్స్ బుక్ చేసుకోవచ్చు. హుడ్ కింద, ఈ మోడల్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లతో అందించబడుతుంది.
ఇంతకు ముందున్న క్రెటాతో పోలిస్తే 2024 హ్యుందాయ్ క్రెటాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. క్రెటా ముందు భాగంలో ఉన్న హారిజాంటల్ గా వేరు చేయబడిన 3 స్లాట్స్ తో కొత్త గ్రిల్ హైలైట్ గా ఉండనుంది. అదే విధంగా ఇందులో కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రెక్టాంగులర్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, అలాగే స్కిడ్ ప్లేట్స్, తాజా ఎల్ఈడీ టెయిల్ లైట్స్, టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీ లైట్ బార్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉండనున్నాయి. ఇంటీరియర్ పరంగా లోపల, హ్యుందాయ్ క్రెటాలో భారీగా రీవర్క్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్, రెండు పెద్ద స్క్రీన్స్ (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్రైవర్ డిస్‌ప్లే కోసం ఒక్కొక్క యూనిట్), టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్, యాంబియంట్ లైటింగ్ మరియు కొత్త గేర్ లీవర్ ఉండనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్