- ఎస్‍యూవీలో మిడ్-లైఫ్ ఫేస్‍లిఫ్ట్ గా వచ్చిన 2024 అల్కాజార్
- పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో లభ్యం
ఇండియాలో లాంచ్
హ్యుందాయ్ కంపెనీ అప్ డేటెడ్ అల్కాజార్ ఎస్‍యూవీని నేడే ఇండియాలో లాంచ్ చేయగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ.14.99 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. పెట్రోల్ వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు రూ.14.99 లక్షల నుంచి ప్రారంభంకాగా, డీజిల్ వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు రూ.15.99 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఎస్‍యూవీ కారుకు మిడ్-లైఫ్ అప్ డేట్ కాగా, డిజైన్ మరియు ఫీచర్ అప్ డేట్ల పరంగా, ఈ మోడల్ హ్యుందాయ్ నుంచి వచ్చిన 5-డోర్ కారు క్రెటాను ఫాలో అయ్యింది.
డిజైన్ లో మార్పులు
ఎక్స్‌టీరియర్ పరంగా, కొత్త అల్కాజార్ మోడల్ బయటి వైపు కొత్త గ్రిల్, హెడ్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, మరియు సిగ్నేచర్ హ్యుందాయ్-కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ వంటి వాటిని పొందింది. ప్రస్తుత మోడల్ లోని సిల్హౌట్ తో పోలిస్తే, ఈ మోడల్ కూడా అదే సిల్హౌట్ తో వచ్చింది. అలాగే, కొత్త కారు కస్టమర్లకు మంచి ఫీల్ ని అందించడానికి దానికి తగినంత ఫీచర్లతో పాటుగా మరిన్ని మెరుగైన ఫీచర్లతో వచ్చింది. కస్టమర్లు ఎవరైతే ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ పెర్ల్, రేంజర్ ఖాకీ, ఫియరీ రెడ్, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, స్టారీ నైట్, టైటాన్ గ్రే మ్యాట్, మరియు అబిస్ బ్లాక్ రూఫ్ తో అట్లాస్ వైట్ అనే ఎనిమిది కలర్ల నుంచి ఈ కారును సెలెక్ట్ చేసుకోవచ్చు.
క్యాబిన్ మరియు ఫీచర్లు
ఇంటీరియర్ పరంగా, హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ క్యాబిన్ ని పెద్ద డ్యూయల్ డిజిటల్ డిస్ ప్లేలు, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లెఫ్ట్ రియర్ ప్యాసింజర్ ని సౌకర్యాన్ని అందించేలా బాస్ మోడ్ ఫంక్షన్, మరియు ఇప్పుడు ఇది లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) వంటి ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ప్రస్తుతం అందించబడిన అల్కాజార్ మోడల్ లాగే, 2024 అల్కాజార్ కూడా వివిధ వేరియంట్లలో 6-సీట్ మరియు 7-సీట్ కాన్ఫిగరేషన్లతో కొనసాగుతుంది.
పవర్ ట్రెయిన్ ఆప్షన్లు
ఆటోమేకర్ అందించిన 1.5-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ తో హ్యుందాయ్ అల్కాజార్ ని పొందవచ్చు, ఈ ఇంజిన్ 158bhp/253Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో అందించబడిన మరో ఇంజిన్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 113bhp/250Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లతో జతచేసి పొందవచ్చు. అలాగే పెట్రోల్ స్పీడ్ డిసిటితో జతచేసి, మరియు డీజిల్ ఇంజిన్ ని 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేసి పొందవచ్చు. ఇందులో అందించబడిన పవర్ ట్రెయిన్లను మనం క్రెటా, కియా సెల్టోస్, మరియు కియా కారెన్స్ వంటి కార్లలో కూడా పొందవచ్చు. ఇంకా ఈ మోడల్ మైలేజీ విషయానికి వస్తే, లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని హ్యుందాయ్ కంపెనీ పేర్కొంది.
కాంపీటీషన్
హ్యుందాయ్ అల్కాజార్ కారుతో పోటీపడే కార్ల విషయానికి వస్తే, ఈ కారు 6-సీట్ మరియు 7-సీట్ కన్ఫిగరేషన్లతో అందించబడిన టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్, మరియు మహీంద్రా XUV700 వంటి మూడు-వరుసల ఎస్‍యూవీలతో పోటీపడుతుంది. ఈ వారం చివరలో మేము హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ కారును డ్రైవ్ చేయబోతున్నాం. ఒకవేళ మీకు ఈ కారుకు సంబంధించి ఎలాంటి సందేహాలు మరియు ప్రశ్నలు ఉన్నా వాటిని మా సోషల్ మీడియా ప్లాట్ ఫారంపై అడగవచ్చు. వాటికి మేము జవాబును అందించడానికి సిద్ధంగా ఉన్నాం.