- కొత్త ఫీచర్లతో అప్ డేట్ అయిన C3 మోడల్
- ఆటోమేటిక్ వెర్షన్ లో కూడా అందించబడనున్న హ్యచ్ బ్యాక్
సిట్రోన్ కంపెనీ లేటెస్టుగా అప్ డేటెడ్ C3 హ్యచ్ బ్యాక్ ని లాంచ్ చేయగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ.6.16 లక్షలతో ప్రారంభమైనట్లు ప్రకటించింది. అలాగే, దీని ఆటోమేటిక్ వేరియంట్ త్వరలో అందుబాటులోకి రానుండగా, ఒకసారి దీని కొత్త ఫీచర్లను పరిశీలిస్తే, ఈ కారు లేటెస్టుగా లాంచ్ అయిన బసాల్ట్ కారు నుంచి చాలా ఫీచర్లను పొందింది.
ఫోల్డబుల్ రూఫ్ గ్రాబ్ హ్యండిల్స్
C3 కారులో మిస్సయిన బేసిక్ ఫీచర్లు అప్ డేటెడ్ C3 కారులో అందించినట్లు కనిపిస్తుండగా, ఇప్పుడు వీటిని అన్ని వేరియంట్లలో తీసుకువచ్చింది. వీటిని ఫ్రంట్ మరియు రియర్ సీట్లలో కూర్చునే ప్యాసింజర్లు పొందుతారు. ఈ కారు కొత్తగా రీపొజిషన్ చేయబడిన రియర్ విండో స్విచ్ లను అందుకుంది. కానీ, అప్ డేటెడ్ C3 బేస్ వేరియంట్ కారు కేవలం ఫ్రంట్ పవర్ విండోస్ ని మాత్రమే పొందింది.
మిడ్-స్పెక్ వేరియంట్ ఫీచర్లలో మార్పులు – చేర్పులు
అప్ డేటెడ్ C3 కారులోని మిడ్-స్పెక్ ఫీల్ (O) వేరియంట్ ఇప్పుడు సేఫ్టీ పరంగా టాప్ టెదర్ మరియు అన్ని త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ లతో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్ పాయింట్లను పొందింది. ఈ వెర్షన్ కూడా టెస్సెరా ఫుల్-వీల్ కవర్ మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ గ్రే కలర్ లో ఒక ప్రొటెక్టివ్ లేయర్ తో వస్తుంది. ప్రస్తుతానికి ఫీల్ వేరియంట్లలో ఎలాంటి డ్యూయల్-టోన్ వెర్షన్లు అందించబడలేదు.
అన్నీ ఫీచర్లతో ఫుల్ ప్యాక్డ్ గా వస్తున్న టాప్-స్పెక్ వేరియంట్
కేవలం టాప్-స్పెక్ షైన్ వేరియంట్లు మాత్రమే పోలార్ వైట్, జెస్టీ ఆరెంజ్, ప్లాటినం గ్రే, మరియు కాస్మోస్ బ్లూ వంటి ఆప్షనల్ కలర్ ఆప్షన్లతో డ్యూయల్-టోన్ కలర్ ని పొందింది. ఇంకా చెప్పాలంటే, షైన్ వేరియంట్లో అందించబడిన ఇంజిన్ స్టార్ట్-స్టాప్, ఈఎస్‍పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, మరియు టిపిఎంఎస్ వంటి ఫీచర్లు ఇప్పటివరకు ఎలాంటి ఫీల్ టర్బో వెర్షన్లో అందించబడలేదు. అలాగే షైన్ వేరియంట్లో అందించబడిన ఇతర ఫీచర్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఓఆర్‌విఎంలపై పవర్డ్ వింగ్ మిర్రర్స్, ఎల్ఈడీ విజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, మరియు పెద్ద 7-ఇంచ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ వంటివి ఉన్నాయి.
కొత్త కనెక్టివిటీ యాప్
సిట్రోన్ కంపెనీ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా రీఫ్రెష్డ్ “మై సిట్రోన్ కనెక్ట్ యాప్” ని పరిచయం చేసింది. అప్ డేటెడ్ C3 టాప్-స్పెక్ కారును కొనుగోలు చేసే కస్టమర్లు వారి కారులో 40 కొత్త స్మార్ట్ ఫీచర్లను పొందుతారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్