- టీజర్ ద్వారా బసాల్ట్ కారు ఇంటీరియర్ ని ప్రదర్శించిన సిట్రోన్
- టీజర్ లో కనిపించిన ప్రొడక్షన్-స్పెక్ బసాల్ట్ మోడల్
ఇండియాలో కొత్త బసాల్ట్ కారును లాంచ్ చేయడానికి ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోన్ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచక పూర్తవుతున్నాయి. ఈ కారు అధికారికంగా వచ్చే నెల ఆగస్టు 2వ తేదీన ఆవిష్కరించబడుతుండగా, దాని కంటే ముందుగా కూపే ఎస్యూవీలోని ఇంటీరియర్ కి సంబంధించిన పూర్తి వివరాలు కొత్త టీజర్ ద్వారా వెల్లడయ్యాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సిట్రోన్ కంపెనీ బసాల్ట్ కారుపై మరింత ఆసక్తిని పెంచేలా పలు టీజర్లను రిలీజ్ చేస్తూనే ఉంది.
ముందుగా మనం అనుకున్న విధంగానే, దీని క్యాబిన్ లుక్ C3 ఎయిర్ క్రాస్ మోడల్ ని తలపిస్తుండగా, ఇది 5-సీట్ లే అవుట్ ని కలిగి ఉంది. టీజర్లో మాట్లాడుతున్న వ్యక్తి ఇది ఆసక్తికరమైన ప్యాటర్న్ తో లైట్ బీజ్ లెదరెట్ ఫ్యాబ్రిక్ వస్తున్నట్లు చెబుతున్నాడు. వెనుక వరుసలో ఉన్న సీట్లు సెంటర్లో త్రీ-పాయింట్ సీట్ బెల్టుతో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్స్ మరియు కప్ హోల్డర్లతో ఫోల్డ్ చేసే విధంగా ఆర్మ్ రెస్టులను పొందుతుంది. అలాగే బసాల్ట్ కారులో 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జింగ్, మరియు మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి.
ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ల పరంగా, (అప్ కమింగ్) రాబోయే బసాల్ట్ కారు ఇండియన్ మార్కెట్లో టాటా కర్వ్ మోడల్ కి గట్టిపోటీని ఇస్తుందని భావిస్తున్నాం. మరికొన్ని రోజుల్లో బసాల్ట్ కారు లాంచ్ కానుండగా, టాటా కర్వ్ వచ్చే వారంలో లాంచ్ కానుంది.
సిట్రోన్ నుంచి వస్తున్న బసాల్ట్ కారు C3 ఎయిర్ క్రాస్ నుంచి 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తీసుకుంటుండగా, ఈ ఇంజిన్ 102bhp పవర్ మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. బసాల్ట్ కారులో అందించబడే పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సు వంటివి ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్