- మోడల్ పేరు నుంచి C3ని తొలగించిన బ్రాండ్
- మరిన్ని కొత్త ఫీచర్లను పొందిన 2024 ఎయిర్ క్రాస్
లేటెస్టుగా కార్ల తయారీ సంస్థ సిట్రోన్ 2024 ఎయిర్ క్రాస్ మోడల్ కారును ఇండియాలో రూ.8.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ అప్ డేటెడ్ ఎస్‍యూవీ మోడల్ పేరును మార్చడంతో పాటుగా, కొత్త ఫీచర్లను కూడా అందించింది. అయితే, 5-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లో అందించబడిన ఈ కారులో టాప్ హైలైట్ ఫీచర్లు ఏమేం ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
మోడల్ పేరులో మార్పు
ఇంతకు ముందు ఈ మోడల్ పేరును C3 ఎయిర్ క్రాస్ గా పిలిచేవారు. మోడల్ పేరులో మార్పులు చేయడంతో ఇది కాస్త ఇప్పుడు కేవలం “ఎయిర్ క్రాస్” గా మారింది.
వేరియంట్లలో మార్పులు
ఇంతకుముందు ఇందులో అందించిన వేరియంట్లను పరిశీలిస్తే, ఈ కారులో యూ, ప్లస్, మ్యాక్స్ మరియు ధోనీ ఎడిషన్ అనే వేరియంట్లు ఉండేవి. వీటికి అదనంగా ఈ కారులో వైబ్ ప్యాక్స్ మరియు డ్యూయల్ టోన్ ఆప్షన్స్ కూడా అందించబడ్డాయి. 2024 అప్‌డేట్ ద్వారా, ఎయిర్ క్రాస్ కారు ఇప్పుడు యూ, ప్లస్ మరియు మ్యాక్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవి ఇంతకుముందు లాగానే డ్యూయల్ టోన్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
కొత్త ఫీచర్లు
ఎయిర్‌క్రాస్ కారులో కొత్తగా ఇప్పుడు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పవర్-ఫోల్డింగ్ ఓఆర్‌విఎంస్ మరియు టాప్-స్పెక్ వేరియంట్ కార్లలో రియర్ ఏసీ వెంట్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో వచ్చాయి. ఈ కారులో 40కి పైగా కనెక్టివిటీ ఫీచర్లను 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఇంకా, ఇందులోని ఇతర సేఫ్టీ ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‍పీ, టిపిఎంఎస్ మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రీపొజిషన్ చేయబడిన స్విచ్‍లు
సిట్రోన్ కంపెనీ ఈ కారులో రియర్ పవర్ విండో స్విచ్‌లను కూడా మార్చింది. ఇవి ఇప్పుడు డోర్ ప్యానెల్స్‌పై మీకు కనిపిస్తాయి.
పవర్ ట్రెయిన్
ప్రస్తుతం అప్ డేటెడ్ C3 ఎయిర్‌క్రాస్ రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 108bhp మరియు 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, ఈ ఎస్‍యూవీలో మీకు 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను పరిశీలిస్తే, ఈ కారులో మీకు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సులు లభిస్తాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్