- ఇండియాలో రూ.16.19 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ధరలు ప్రారంభం
- 6 మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్ లో లభ్యంకానున్న టాటా సఫారి
టాటా కంపెనీ తాజాగా దాని ఫ్లాగ్ షిప్ ఎస్యువి సఫారి ఫేస్లిఫ్టును ఇండియాలో రూ.16.19 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. మొత్తంగా ఇది 5 వేరియంట్స్ లో 7 కలర్ ఆప్షన్స్ తో అందించబడగా, ఈ ఎస్‌యువిని 6 మరియు 7-సీటర్ వెర్షన్ లో రూ.25,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా వీటి డెలివరీ మరి కొన్ని వారాల్లో ప్రారంభంకానుంది.
ఇండియాలోని టాప్-10 నగరాల్లో కొత్తగా లాంచ్ అయిన సఫారి ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధరలు ఇలా ఉన్నాయి:
నగరాలు | బేస్ వేరియంట్ | టాప్ వేరియంట్ |
ముంబై | రూ. 19.75 లక్షలు | రూ. 33.31 లక్షలు |
ఢిల్లీ | రూ. 19.49 లక్షలు | రూ. 32.58 లక్షలు |
బెంగళూరు | రూ. 20.19 లక్షలు | రూ. 34.05 లక్షలు |
కోల్‌కతా | రూ. 19.05 లక్షలు | రూ. 31.86 లక్షలు |
హైదరాబాద్ | రూ. 20.18 లక్షలు | రూ. 34.04 లక్షలు |
చెన్నై | రూ. 19.74 లక్షలు | రూ. 33.07 లక్షలు |
లక్నో | రూ. 19.03 లక్షలు | రూ. 31.83 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 18.40 లక్షలు | రూ. 30.76 లక్షలు |
ఇండోర్ | రూ. 19.36 లక్షలు | రూ. 33.47 లక్షలు |
జైపూర్ | రూ. 19.19 లక్షలు | రూ. 32.10 లక్షలు |
హుడ్ క్రింద, ఫేస్‌లిఫ్టెడ్ ఎస్యువి బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. ఈ మోటార్ ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేసేలా 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ జత చేయబడి 168bhp మరియు 350Nm టార్క్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్