- రూ. 15.49 లక్షలతో ధరలు ప్రారంభం
- 10 వేరియంట్స్ లో లభ్యం
టాటా మోటార్స్ ఇండియాలో అప్ డేటెడ్ హారియర్ ను గత వారం రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ మిడ్-సైజ్ ఎస్‍యువి యొక్క ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ మొత్తం 10 వేరియంట్స్ లో 7 కలర్స్ లో అందుబాటులో ఉంది. కస్టమర్స్ ఎవరైతే కొత్త హారియర్ ను బుక్ చేయాలని భావిస్తున్నారో వారు 6 నుంచి 8 వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిపై 6 నుంచి 8 వారాల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది మరియు వీటి డెలివరీ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. ఈ ఆర్టికల్ లో మేము ఇండియాలోని టాప్-10 నగరాల్లో 2023 టాటా హారియర్ ఫేస్‍లిఫ్ట్ యొక్క వేరియంట్ వారీగా ధరలను క్రింది లిస్టు ద్వారా అందించాము. ఈ లిస్టు ద్వారా మీరు ఏ నగరంలో 2023 టాటా హారియర్ ఫేస్‍లిఫ్ట్ ధర ఎంత ఉంది అనే అంశాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు.
నగరాలు | బేస్ వేరియంట్ | టాప్ వేరియంట్ |
ముంబై | రూ. 18.91 లక్షలు | రూ. 32.23 లక్షలు |
ఢిల్లీ | రూ. 18.67 లక్షలు | రూ. 31.52 లక్షలు |
బెంగళూరు | రూ. 19.34 లక్షలు | రూ. 32.95 లక్షలు |
కోల్‌కతా | రూ. 18.25 లక్షలు | రూ. 30.82 లక్షలు |
హైదరాబాద్ | రూ. 19.33 లక్షలు | రూ. 32.94 లక్షలు |
చెన్నై | రూ. 19.04 లక్షలు | రూ. 32.16 లక్షలు |
లక్నో | రూ. 18.23 లక్షలు | రూ. 30.79 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 17.63 లక్షలు | రూ. 29.76 లక్షలు |
ఇండోర్ | రూ. 18.54 లక్షలు | రూ. 32.38 లక్షలు |
జైపూర్ | రూ. 18.38 లక్షలు | రూ. 31.06 లక్షలు |
కొత్త టాటా హారియర్ ను 10 వేరియంట్స్ లో పొందవచ్చు. అవి ఏవి అంటే, స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ +. అడ్వెంచర్ + డార్క్, అడ్వెంచర్ + ఎ, ఫియర్ లెస్, ఫియర్ లెస్ డార్క్, ఫియర్ లెస్ +, మరియుఫియర్ లెస్ + డార్క్. ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఈ ఎస్‍యువి 12.3-ఇంచ్ టచ్ స్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10-స్పీకర్ జెబిఎల్ –మ్యూజిక్ సిస్టం, ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ కంట్రోల్డ్ హెచ్‍విఎసి ప్యానెల్, మరియు ఇల్యుమినేటెడ్ లోగోతో కూడిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, పవర్డ్ టెయిల్ గేట్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, ఆటో-డిమ్మింగ్ ఐవిఆర్ఎం, మరియు పనోరమిక్ సన్ రూఫ్ కూడా ఉన్నాయి.
మెకానికల్ గా చెప్పాలంటే, హారియర్ ఫేస్‍లిఫ్ట్ యొక్క పవర్డ్ 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జత చేయబడి ఉంది. ఈ మోటార్ 168bhp మరియు 350Nm మాక్సిమం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్