- రెండు వేరియంట్స్ లో రానున్న i20 ఎన్ లైన్
- 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వచ్చే అవకాశం
కొన్ని వారాల క్రితం, హ్యుందాయ్ మోటార్ ఇండియా i20 ఫేస్‌లిఫ్ట్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈఆటోమేకర్ హ్యాచ్‌బ్యాక్ ఎన్లైన్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది, వీటి ధరలు రూ. 9.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభంకానున్నాయి. i20 ఫేస్‌లిఫ్ట్ N6 మరియు N8 అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది, i20ఎన్లైన్ మనకు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ముందుగా ఫ్రంట్ ఎక్విప్ మెంట్ గురించి చెప్పుకుంటే, ఈ హ్యాచ్‌బ్యాక్ స్పోర్టీ వెర్షన్ బోస్ ప్రీమియం 7-స్పీకర్ సిస్టమ్, 127 ఎంబెడెడ్ VR కమాండ్స్, ఓటీఏఅప్డేట్స్ కోసం మ్యాప్స్, ఇన్ఫోటైన్‌మెంట్, 52 హింగ్లీష్ వాయిస్ కమాండ్స్ మరియు 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది 7 యాంబియంట్ నేచర్ సౌండ్స్, సి-టైప్ ఛార్జర్ మరియు 10 రీజనల్ మరియు 2 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కు సపోర్ట్ చేసే మల్టీలాంగ్వేజ్ UIతో వస్తుంది.
కస్టమర్స్ ఫేస్‌లిఫ్టెడ్ i20ఎన్ లైన్‌ని 5 మోనోటోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ ద్వారా ఎంచుకోవచ్చు. మోనోటోన్‌లలో అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, థండర్ బ్లూ మరియు స్టార్రీ నైట్ ఉన్నాయి. మరోవైపు, డ్యూయల్ టోన్స్ లో అట్లాస్ వైట్ మరియు థండర్ బ్లూ కలర్స్ ఉన్నాయి. ఈ రెండూ ఏబిస్ బ్లాక్ రూఫ్‌తో రానున్నాయి.
హ్యుందాయ్ i20ఎన్లైన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 118bhpమరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ డ్యూటీ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ ద్వారా నిర్వహించబడుతుంది.
2023 హ్యుందాయ్ i20 ఎన్లైన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
వేరియంట్స్ | ఎక్స్ షోరూం ధర |
N6 ఎంటి | రూ.9,99,490 |
N6 డిసిటి | రూ.11,09,900 |
N8 ఎంటి | రూ.11,21,900 |
N8 డిసిటి | రూ.12,31,900 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్