- 27 మే 2024 నుంచి ప్రారంభమైన కారు కార్ల డెలివరీ
- లాంచ్ తర్వాత మరో మైల్ స్టోన్ ని సాధించిన ఎస్‍యూవీ
మహీంద్రా & మహీంద్రా కంపెనీ దేశవ్యాప్తంగా కేవలం ఒక్కరోజులోనే 1,500 యూనిట్ల XUV 3XO కార్లను డెలివరీ చేసి మరొక మైల్ స్టోన్ ని సాధించింది. లేటెస్ట్ గా లాంచ్ అయిన ఎస్‍యూవీ కార్ల డెలివరీ 27 మే 2024 నుంచి ప్రారంభమైంది.
మహీంద్రా XUV 3XO మోడల్ MX1, MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5, AX5 లగ్జరీ, AX7, మరియు AX7 లగ్జరీ అనే తొమ్మిది వేరియంట్లలో అందించబడగా, దీని ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 7.49 లక్షలుగా ఉంది.
మాకు అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ ఎస్‍యూవీలోని AX5 వేరియంట్ మోస్ట్ పాపులర్ మరియు విపరీతమైన డిమాండ్ ఉన్న వేరియంట్ గా కొనసాగుతుంది. కస్టమర్లు ఈ వేరియంట్ ని రూ. 10.69 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్సులతో పెట్రోల్ మరియు డీజిల్ రకాలలో పొందవచ్చు.
ఫీచర్ల పరంగా, AX5 వేరియంట్ గురించి చెప్పాలంటే, ఈ వేరియంట్ 3XO కారు ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ 10.25-ఇంచ్ స్క్రీన్లు, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, టిపిఎంఎస్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్స్ వంటి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది.
మహీంద్రా XUV 3XOలో అందించబడిన పవర్ ట్రెయిన్ ఆప్షన్ల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
ఇంజిన్ | పవర్ అవుట్ పుట్ | ఫ్యూయల్-ఎఫిషియన్సీ (ఎంటి/ఎటి) |
1.2-లీటర్ టిసిఎంపిఎఫ్ఐ పెట్రోల్ | 109bhp/200Nm | 18.89కెఎంపిఎల్ /17.96కెఎంపిఎల్ |
1.2-లీటర్ టిజిడిఐ పెట్రోల్ | 129bhp/230Nm | 20.10కెఎంపిఎల్/18.20కెఎంపిఎల్ |
1.5-లీటర్ సిఆర్డిఐ డీజిల్ | 115bhp/300Nm | 20.60కెఎంపిఎల్/21.20కెఎంపిఎల్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్