- లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ తో మరింత సేఫ్ గా ప్రయాణం
- ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీలో ఏడీఏఎస్ ఫీచర్స్ పై దృష్టి సారించిన కార్ల కంపెనీలు
ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగానే కార్ల తయారీ సంస్థలు సేఫ్ మరియు టెక్నికల్ గా ఫీచర్స్ ను కార్లలో డెవలప్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతంఅడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏడీఏఎస్) కార్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఏడీఏఎస్-ఫిట్టెడ్ కార్లు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ని మెరుగుపరచడమే కాకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కూడా చాలా వరకు దోహదపడతాయి. ప్రస్తుతం ఇండియాలో రూ.15 లక్షల లోపు ఏడీఏఎస్ తో లభించే టాప్-5కార్ల లిస్టును సిద్ధం చేశాము.మీరు కూడా త్వరలో మీ కుటుంబం కోసం కొత్త కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా ? అయితే, మేము మీకోసం సిద్ధం చేసిన లిస్టును తప్పనిసరిగా చెక్ చేసి, బెస్ట్ కారును కొనుగోలు చేయండి.
కియా సెల్టోస్
మంచి బ్యాలెన్సింగ్ ఫీచర్స్, మంచిక్యాబిన్ ఎక్స్‌పీరియన్స్, పెర్ఫార్మెన్స్ మరియు ఎక్స్‌టీరియర్ డిజైన్ ని అందించే ఎస్‍యూవీని కోరుకునే ఎవరికైనా కియా సెల్టోస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీని ధరలు ₹10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ధరలు ప్రారంభంకానున్నాయి.సెల్టోస్ ప్రస్తుతం దేశంలోని అత్యంత చవకైన ఎస్‍యూవీలలో ఒకటిగా మనం భావించవచ్చు మరియు హై వేరియంట్స్ లో ఇది లెవెల్2ఏడీఏఎస్ ఫీచర్స్ తో అందించబడుతుంది. ఇందులో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్ మరియు రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నా ఇండియాలో జిఎన్ క్యాప్సేఫ్టీ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించిన మొదటి హ్యుందాయ్ కారుగా నిలిచింది. ప్రస్తుతం, హోండా సిటీ, ఫోక్స్ వ్యాగన్వర్టూస్ తో పోటీ పడుతుంది. రూ. 10.96 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లభించే హ్యుందాయ్ వెర్నాలో బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ - అవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ ఫాలోయింగ్ మరియు కీపింగ్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అవాయిడెన్స్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి లెవెల్-2 ఫీచర్స్ ఉన్నాయి.
హోండా ఎలివేట్
ఇటీవలే లాంచ్ చేయబడిన హోండా ఎలివేట్ యొక్క రీఫైన్డ్ మరియు లోడెడ్ ప్యాకేజీకి చర్చనీయాంశంగా మారింది, ఇది క్రెటా మరియు సెల్టోస్ వంటి కార్లతో పోటీపడటానికి సహాయపడింది. హోండా ఎలివేట్ 1.5-లీటర్ పెట్రోల్ మోటారుతో మాత్రమే అందించబడుతుంది. ఇందులో హోండా సెన్సింగ్ సూట్, ఫార్వార్డ్ కొలిజన్ మరియు అవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ కీప్ అసిస్ట్, సపోర్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ700
ఇండియాలో ప్రస్తుతంమహీంద్రా ఎక్స్‌యువి700 ధర రూ.17.59 లక్షలు(ఎక్స్-షోరూం)గాఉంది. మహీంద్రా ఎక్స్‌యువి700 లాంచ్ అయి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దేశంలో ఒక పాపులర్ ఎస్‍యూవీగా కొనసాగుతోంది మరియు టాటా హారియర్ మరియు ఎంజిహెక్టర్ వంటి మోడల్స్ కి గట్టి పోటీనిస్తుంది. జిఎన్ క్యాప్ సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించి సేఫ్టీ పరంగా బెస్ట్ కారుగా నిలిచింది. ఇందులో 7-ఎయిర్ బ్యాగ్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి బెస్ట్ ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి.
ఎంజి హెక్టర్
ఎంజి హెక్టర్‌ను లాంచ్ చేయడం ద్వారా ఇండియన్ మార్కెట్లోకి ఎంజిఅరంగేట్రం చేసింది. దీని ప్రారంభ ధర రూ.14.99 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది. హెక్టర్ ప్రీమియం మరియు ఫీచర్-లోడెడ్ ఎస్‍యూవీగా అందుబాటులోకి వచ్చింది. ఇందులో బెండ్ క్రూయిజ్ అసిస్ట్ తో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ మరియు కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ అసిస్ట్ వంటి బెస్ట్ లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి.