- ప్రస్తుతం ఇండియాలో మూడు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని విక్రయిస్తున్న ఎంజి
- పూర్తి కొనుగోలు లేదా బ్యాటరీ ఒక సర్వీసుతో అందించబడుతున్న అన్ని ఎలక్ట్రిక్ వెహికిల్స్
ధన్ తేరస్ పండుగను కస్టమర్లు మరింత ఘనంగా సెలెబ్రేట్ చేసే విధంగా జెఎస్ డబ్లూ ఎంజి మోటార్ ఇండియా కేవలం ఒక్కరోజులోనే ఢిల్లీ ప్రాంతంలో వందకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసింది. ఎంజి కంపెనీ డెలివరీ చేసిన కార్లలో కామెట్ ఈవీ, విండ్ సర్ ఈవీ, మరియు ZS ఈవీ వంటి కార్లు ఉన్నాయి.
ఇండియాలో బ్రాండ్ నుంచి లేటెస్టుగా అందించబడుతున్న వాటిలో విండ్ సర్ ఈవీ కారు ఉంది. ఈ కారు బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 15 వేలకు పైగా బుకింగ్స్ పొందింది. మొదటగా, ఈ మోడల్ రూ.9.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో బ్రాండ్ కొత్తగా అమలుపరుస్తూ బ్యాటరీ ఒక సర్వీసు ((BaaS) ప్లాన్ ని తీసుకువచ్చింది. తర్వాత కస్టమర్లకు మరింత చేరువయ్యేలా బ్యాటరీతో కలిపి రూ.13.5 లక్షల ఎక్స్-షోరూం ధరతో విండ్ సర్ ఈవీ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది.
పైన పేర్కొన్న బ్యాటరీ ఒక సర్వీసు ప్లాన్ కేవలం విండ్ సర్ ఈవీకి మాత్రమే ఎంజి పరిమితం చేయలేదు. ఈ ప్లాన్ ని కామెట్ ఈవీ మరియు ZS ఈవీకి కూడా విస్తరించింది. దీంతో ఈ ఎలక్ట్రిక్ కార్లు వరుసగా రూ.4.99 లక్షలు మరియు రూ.13.99 లక్షల ఎక్స్-షోరూం ధరలతో లభిస్తాయి. ఈ వారం ప్రారంభంలో, ఆటోమేకర్ బెంగుళూరులోనే 100 పైగా విండ్ సర్ ఈవీ యూనిట్లను డెలివరీ చేసింది. అలాగే, త్వరలోనే ఈ సీయూవీల డెలివరీ దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్