- రూ. 12.99 లక్షలతో ప్రారంభమైన థార్ రాక్స్ ధరలు
- రెండు ఇంజిన్ ఆప్షన్స్ లో 4X4 ను పొందిన త్రీ -డోర్ థార్
థార్ రాక్స్ అని పిలువబడే థార్ ఫైవ్-డోర్ వెర్షన్‌ను మహీంద్రా ఇటీవలే లాంచ్ చేసింది. ఈ కొత్త ఎస్‌యువి భారీగా కనిపించడమే కాకుండా త్రీ-డోర్ వెర్షన్ లో మిస్సయ్యే అనేక ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ కథనంలో, 2020 సంవత్సరం నుండి విక్రయిస్తున్న త్రీ -డోర్ థార్ తో పోలిస్తే థార్ రాక్స్ లో లభిస్తున్న టాప్-10 ఫీచర్లను ఇప్పుడు మనం చూద్దాం.
లెవల్- 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్
ఇప్పుడు థార్ లో ఉన్న అనేక ఫీచర్స్ XUV700 నుండి తీసుకోబడ్డాయని భావిస్తున్నాం. ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త థార్ రాక్స్ లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ తో అందించడమేకాకుండా, ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్
త్రీ-డోర్ వెర్షన్ బ్లాక్ థీమ్ తో రాగా, అందుకు భిన్నంగా థార్ రాక్స్ సరికొత్త వైట్ అప్హోల్స్టరీని పొందింది. అంతే కాదు, కొత్త అప్హోల్స్టరీతో, థార్ రాక్స్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే, డ్రైవర్ సీట్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్ మెంట్ పొందింది. అయితే ఇందులో కో-డ్రైవర్ సీట్స్ ను మాన్యువల్‌గా అడ్జస్ట్డ్ చేయవచ్చు.
360-డిగ్రీ సరౌండ్ కెమెరా
మహీంద్రా ప్రొడక్ట్స్ మాదిరిగానే, XUV 3XOతో సహా అనేక కార్లలో మరియు థార్ రాక్స్ బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో పాటు 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటి ఫీచర్లను పొందింది.
భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఈ ఎస్‌యువి కొత్త ఇటరేషన్ 10.25-ఇంచ్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ తో కూడిన వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ని కలిగి ఉంది. అంతేకాకుండా, థార్ రాక్స్ లోపలి భాగం, అలెక్సాతో అడ్రినాక్స్-కనెక్ట్ చేయబడిన కార్ ఫంక్షన్‌ల పూర్తి సూట్ లో లభిస్తుంది.
థార్ రాక్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మోడెర్న్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్‌తో థార్ రాక్స్ త్రీ -డోర్ వెర్షన్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది.
సన్‌రూఫ్
సెలెక్ట్ చేసుకునే వేరియంట్ ని బట్టి, థార్ రాక్స్ రెండు సన్‌రూఫ్ ఆప్షన్లను పొందింది. అందులో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సింగిల్ పేన్ మరియు పెద్ద డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ అనేవి ఉన్నాయి.
థార్ రాక్స్, టాప్-ఎండ్ వేరియంట్‌లు, మాన్యువల్ హ్యాండ్‌బ్రేక్‌ను మిస్ అవుతుండగా ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌ను మహీంద్రా అందిస్తుంది.
ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్
కొత్త థార్ రాక్స్ హర్మాన్ కార్డాన్ సోర్స్డ్ 8 స్పీకర్స్ మరియు సబ్-వూఫర్‌తో బెటర్ సౌండ్ సిస్టమ్‌ని పొందింది. అలాగే, అవుట్‌పుట్ ఒకరి ఇష్టానికి అనుగుణంగా ట్యూన్ చేయడానికి వివిధ సౌండ్ మోడ్‌స్ కూడా ఉన్నాయి.
పూర్తి ఎల్ఈడీ లైటింగ్
కొత్త థార్ రాక్స్ లో సి-షేప్డ్ డిఆర్ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్, టెయిల్‌ల్యాంప్స్ మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వంటి ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉంది.
కీలెస్ స్టార్ట్/స్టాప్ బటన్
త్రీ-డోర్ థార్ వలె కాకుండా, కొత్త థార్ రాక్స్ కీ లెస్ స్టార్ట్/స్టాప్ బటన్ తో లభిస్తుంది. అయితే, ఇది కీలెస్ ఎంట్రీ ఫంక్షన్‌ను మిస్ అవుతుంది.
త్రీ-డోర్ వెర్షన్ తో పోలిస్తే థార్ రాక్స్ అందించబడిన టాప్ 10 ఫీచర్లు ఇవి కాగా, ఇవి మాత్రమే కాకుండా, పెద్ద 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, పెద్ద బూట్ స్పేస్, ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్, 60:40 స్ప్లిట్ రియర్ బెంచ్ సీట్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్ మరియు ఆటోమేటిక్ వైపర్స్ వంటి మరిన్ని ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి, ఈ ఫీచర్లను థార్ రాక్స్ లో తీసుకురావడం గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.
అనువాదించిన వారు: రాజపుష్ప