మీరు ఏమనుకుంటున్నారు?
రాబోయే న్యూ Q5 థర్డ్-జెన్ పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.
ధర
ఆడి న్యూ Q5 థర్డ్-జెన్ ధరలు Rs. 65.00 లక్షలు - Rs. 73.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
కొత్త ఆడి Q5ఎప్పుడు లాంచ్ అవుతుంది?
కొత్త Q5 సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయనుండగా, జూన్ 2025లో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నాం.
దీనిని ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?
నెక్స్ట్-జెన్ Q5ని ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు వేరియంట్‌లలో పొందవచ్చు.
అప్‌డేటెడ్ఆడి Q5లో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉంటాయి?
ఎక్స్‌టీరియర్:
బయటి భాగంలో, 2025 ఆడి Q5లో స్వెప్ట్‌బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్స్, కొత్త బ్లాక్-అవుట్ గ్రిల్, ఫ్రెష్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త వీల్స్ సెట్ మరియు కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లతో కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ను పొందే అవకాశం ఉంది.
ఇంటీరియర్:
కొత్త Q5 ఇంటీరియర్ మార్పులకు సంబంధించిన వివరాలను ఆడి కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
మోడల్ లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి?
బ్రాండ్ ప్రీమియం ప్లాట్‌ఫాం కంబషన్ (PPC) ఆర్కిటెక్చర్ ఆధారంగా, థర్డ్ - జెన్Q5 మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌లతో జత చేయబడిన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను పొందే అవకాశం ఉంది. అలాగే, గ్లోబల్ మార్కెట్‌లలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌ను పొందుతుంది. ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న Q5 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో జత చేయబడిన 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ని పొందింది. మునుపటి వాటిలో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో ఆడి ఇంకా నిర్ధారించలేదు.
కొత్త ఆడి Q5 కార్ సేఫ్ అనే చెప్పవచ్చా?
న్యూ-జెన్ Q5ని ఇంకా ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
నెక్స్ట్-జెన్ ఆడి Q5 కి ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
కొత్త ఆడి Q5 బిఎమ్‌డబ్ల్యూ X3, మెర్సిడెస్-బెంజ్ GLC మరియు వోల్వో XC60 వంటి వాటికి పోటీగా ఉంటుంది.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :-31-08-2024
ఇండియాలో ఉన్న ఆడి న్యూ Q5 థర్డ్-జెన్ క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.