ఇండియాలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు వివిధ మోడల్స్ ని లాంచ్ చేశాయి. 2023లో వాటి వాటి సెగ్మెంట్స్ లో సెడాన్స్, హ్యచ్ బ్యాక్స్, ఎస్‌యూవీలు, మరియు క్రాస్ ఓవర్స్ కూడా చూసాము. ఈ సంవత్సరం ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎన్నో కార్లు లాంచ్ అవ్వగా, వాటిలో నుంచి మేము టాప్-5 కార్లను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఇప్పుడు మనం వాటి వివరాలను పరిశీలిద్ధాం.
హ్యుందాయ్ వెర్నా
అప్డేటెడ్ హ్యుందాయ్ వెర్నా 2023 మార్చిలో ఇండియాలో లాంచ్ చేయబడింది. ఈ పవర్డ్ న్యూ-జెన్ సెడాన్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అద్బుతమైన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ను పొందింది. దీని ప్రస్తుత ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.96 లక్షలుగా ఉంది. అలాగే ఇది EX, S, SX, మరియు SX (O) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | పవర్ అవుట్‌పుట్ |
1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ | 6-స్పీడ్ మాన్యువల్/సివిటి | 113bhp/144Nm |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ | 6-స్పీడ్ మాన్యువల్/7-స్పీడ్ డిసిటి | 158bhp/253Nm |
మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఇండియాలో ఏప్రిల్‌లో బాలెనో-బేస్డ్ క్రాస్ఓవర్ ఫ్రాంక్స్‌ను లాంచ్ చేసింది. ఈ మోడల్ ప్రత్యేకంగా దాని డిజైన్, ఫీచర్స్ మరియు పెర్ఫార్మెన్స్ ద్వారా 2023లో మోస్ట్ పాపులర్ కార్లలో ఒకటిగా నిలిచింది. 5 వేరియంట్లలో లభిస్తున్న ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ. 7.46 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గత నెలలో, ఈ ఇండియన్ ఆటోమేకర్ 75,000 యూనిట్లు ఫ్రాంక్స్ కార్లను విక్రయించి సరికొత్త మైల్‌స్టోన్‌ని సాధించింది. తాజాగా, దీనిపై ఇంటర్నల్ క్రాష్-టెస్ట్ నిర్వహించగా, త్వరలో బిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్టింగ్ నిర్వహించాలని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | పవర్ అవుట్‌పుట్ |
1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ | 5-స్పీడ్ మాన్యువల్/ఎఎంటి/ | 89bhp/113Nm |
1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ +సిఎన్జి | 5-స్పీడ్ మాన్యువల్ | 76bhp/98.5Nm |
1.0-లీటర్ టర్బో-పెట్రోల్ | 5-స్పీడ్ మాన్యువల్/ టార్క్ కన్వర్టర్ | 99bhp/147Nm |
కియా సెల్టోస్
కొరియన్ ఆటోమేకర్ కియా, ఇండియాలో 2023 జూలైలో తన మోస్ట్ పాపులర్ ఎస్యూవీ అయిన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ మిడ్-సైజ్ ఎస్యూవీ లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్)సూట్‌తో సహా ఫీచర్ల పరంగా బెస్ట్ అప్‌గ్రేడ్ పొందింది. సంవత్సరం తరువాత, దానికున్న డిమాండ్ కారణంగా సెల్టోస్ ధరలలో అనేక సార్లు మార్పులు చేయబడ్డాయి. ప్రస్తుతం, కియా సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | పవర్ అవుట్‌పుట్ |
1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ | 6-స్పీడ్ మాన్యువల్/సివిటి | 113bhp/144Nm |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ | 6-స్పీడ్ ఐఎంటి/7-స్పీడ్ డిసిటి | 158bhp/253Nm |
1.5-లీటర్ డీజిల్ | 6-స్పీడ్ ఐఎంటి/6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ | 114bhp/250Nm |
హోండా ఎలివేట్
హోండా కార్స్ ఇండియా ఈ సంవత్సరం ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న ఎస్యూవీ అయిన హోండా ఎలివేట్‌ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. 4 వేరియంట్లలో లభిస్తున్న హోండా ఎలివేట్ ఎస్యూవీ రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయించబడుతుంది. పాజిటివ్ అంశాల గురించి చెప్పాలంటే, ఎలివేట్ లో విశాలమైన క్యాబిన్, రీఫైన్డ్ ఇంజిన్ మరియు సేఫ్టీ ఎక్విప్ మెంట్ అద్బుతంగా ఉంది. దీంతో హోండా ఎలివేట్ ఇతర మోడల్స్ కి గట్టి పోటీనిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | పవర్ అవుట్‌పుట్ |
1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ | 6-స్పీడ్ మాన్యువల్/సివిటి | 119bhp/145Nm |
హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ ఎక్స్టర్ దాని సెగ్మెంట్లో ఒక గేమ్-ఛేంజర్ ప్రోడక్ట్ గా నిలవడమే కాకుండా సేల్స్ పరంగా కొరియన్ ఆటోమేకర్‌కు అధిక లాభాలను తెచ్చిపెట్టింది. గ్రాండ్ i10 నియోస్-బేస్డ్ ఎస్యూవీ అయిన హ్యుందాయ్ ఎక్స్టర్ 7 వేరియంట్లలో రూ. 6.35 లక్షలు(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. తాజాగా ఈ మోడల్ ఇండియాలో ఒక లక్ష బుకింగ్స్ సాధించి సరికొత్త మైల్‌స్టోన్‌ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా, ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024 పోటీలో హ్యుందాయ్ ఎక్స్టర్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | పవర్ అవుట్‌పుట్ |
1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ | 5-స్పీడ్ మాన్యువల్/ఎఎంటి | 82bhp/114Nm |
1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్+సిఎన్జి | 5-స్పీడ్ మాన్యువల్ | 68bhp/95.2Nm |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్